Saleswaram Jatara: సలేశ్వరం జాతర షురూ.. పోటెత్తిన భక్తజన సందోహం
ABN, Publish Date - Apr 13 , 2025 | 07:57 AM
ప్రతీ ఏడాది చైత్ర పౌర్ణమికి భక్తులకు సలేశ్వరం లింగమయ్య స్వామి దర్శనమిస్తారు. లింగమయ్య స్వామిని దర్శించుకోవడానికి రెండు తెలుగు రాష్టాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట తదితర రాష్టాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. మూడు రోజుల పాటు ఈ జాతర వైభవంగా జరుగనుంది.

ప్రతీ ఏడాది చైత్ర పౌర్ణమికి భక్తులకు సలేశ్వరం లింగమయ్య స్వామి దర్శనమిస్తారు.

లింగమయ్య స్వామిని దర్శించుకోవడానికి రెండు తెలుగు రాష్టాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట తదితర రాష్టాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. మూడు రోజుల పాటు ఈ జాతర వైభవంగా జరుగనుంది.

ఫరాహాబాద్ చౌరస్తా నుంచి దాదాపు 18 కిలోమీటర్ల దట్టమైన అటవీ మార్గంలో భక్తులు వెళ్లి లింగమయ్య స్వామిని దర్శించుకుంటారు.

రాంపూర్ పెంట వరకు వాహనాల్లో వెళ్లి అక్కడి నుంచి మోకాళ్ల కురువ ప్రాంతం వరకు స్థానికంగా ఉండే ఆటోల్లో వెళ్తారు. అక్కడినుంచి కాలినడకన మహిమాన్విత లింగమయ్య స్వామిని దర్శించుకుంటున్నారు.

మొదటి రోజు అన్నిదారులు సలేశ్వరం వైపే అన్నట్లుగా పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, బస్సులు తరలి వెళ్లాయి.

సలేశ్వరం జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఫరాహాబాద్, రాంపూర్, మోకాళ్ల కురువ వద్ద ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు.

ఆర్‌అండ్‌బీ అధికారులు మహిళలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేశారు.

మోకాళ్ల కురువ సమీపంలో అన్నప్రసాదాల పంపిణీకి వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమికి అటు రెండు రోజులు, ఇటు రెండు రోజులు సలేశ్వర స్వామి ఆలయాన్ని తెరిచి ఉంచే అనవాయితీ కొన్ని ఏళ్లుగా కొనసాగింది. ప్రస్తుతం మూడు రోజులే ఈ జాతరకు అనుమతి ఇచ్చారు.

స్వచ్ఛంద సంస్థలు భక్తులకు పండ్లు, ఫలహారాలతో పాటు రాగిజావ, మజ్జిగ, అన్నప్రసాదాలను అందజేశారు.

లింగమయ్య దర్శనం కోసం 6నుంచి 8గంటల సమయం పడుతుంది. సలేశ్వర జాతర చరిత్రలో ఈ ఏడాది వచ్చిన భక్తులు ఎప్పుడూ రాలేదని సంబంధిత అధికారులు తెలిపారు.

దట్టమైన అభయారణ్యంలో రెండు కొండల నడుమ వేయ్యి అడుగుల లోతులో కొండ గుహలో ఉన్న మహిమాన్విత లింగమయ్యస్వామిని దర్శించుకుంటే తమ కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు.
Updated at - Apr 13 , 2025 | 08:19 AM