Viral Video: కోర్టులో లాయర్‌పై రెచ్చిపోయిన అమ్మాయిలు.. దారుణంగా చితక్కొట్టారు..
ABN , Publish Date - Apr 03 , 2025 | 06:22 PM
2 Women And Lawyer Viral Video Basti: లాయర్‌ను వెతుక్కుంటూ ఆ అమ్మాయి ఏకంగా కోర్టుకు వచ్చింది. వచ్చీరాగానే అతడిపై మాటల దాడికి దిగింది. కొద్ది సేపటి తర్వాత ఆమె స్నేహితురాలు అక్కడికి వచ్చింది. లాయర్‌పై చేతల దాడికి దిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

లాయర్లన్నా.. పోలీసులన్నా.. ఒకప్పుడు సాధారణ జనానికి భయం ఉండేది. వాళ్లతో పెట్టుకోవటం ఎందుకులే అనుకునేవారు. కానీ, ఇప్పుడు కాలం మారింది. ముఖ్యమంత్రిని కూడా జనాలు లెక్కచేయటం లేదు. లాయర్లు, పోలీసులు ఎంత. తాజాగా, ఓ లాయర్‌ను ఇద్దరు అమ్మాయిలు దారుణంగా చితక్కొట్టారు. అది కూడా కోర్టులోనే అతడిపై దాడికి దిగారు. అందరూ చూస్తుండగా.. రెచ్చిపోయి మరీ లాయర్‌ను కుమ్మిపడేశారు. ఈ సంఘటన క్రైమ్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన ఉత్తర ప్రదేశ్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అక్కడి బస్తీ సివిల్ కోర్టులో లాయర్‌గా పని చేస్తున్నాడు. ఏప్రిల్ 3వ తేదీ అతడు ఓ యువతితో ఫోన్‌లో గొడవ పెట్టుకున్నాడు.
ఆమెను ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె.. ఈ విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పింది. ఆ వెంటనే బస్తీ సివిల్ కోర్టుకు వెళ్లింది. అక్కడ లాయర్‌తో గొడవపెట్టుకుంది. ఇద్దరి మధ్యా తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. కొద్దిసేపటి తర్వాత యువతి స్నేహితురాలు అక్కడికి వచ్చింది. వచ్చీ రాగానే లాయర్‌పై దాడికి దిగింది. అప్పటి వరకు మాటల యుద్ధంలా ఉన్నది కాస్తా చేతల యుద్ధంలా మారింది. ఆ ఇద్దరు అమ్మాయిలు లాయర్‌ను కొట్టడం మొదలెట్టారు. ఆ లాయర్ కూడా వెనక్కు తగ్గలేదు. తిరిగి వారిపై దాడికి దిగాడు. అమ్మాయిలు అతడి చొక్కా పట్టుకుని, కాళ్లతో చేతుల్తో కొట్టారు. అక్కడే ఉన్న లాయర్లు, ఇతర జనం వాళ్లను పక్కకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
కొద్దిసేపటి తర్వాత ఓ అమ్మాయి వెనక్కు తగ్గింది. మరో అమ్మాయి మాత్రం తగ్గేదేలా అని లాయర్‌ను కొట్టడానికి ప్రయత్నించింది. స్నేహితురాలు ఆమెను పట్టి వెనక్కులాగటంతో .. కొంచెం సల్లబడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇక, ఆ ఇద్దరు అమ్మాయిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బస్తీ బార్ అసోసియేషన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. కోర్టు పరిధిలో శాంతి, భద్రతలకు విఘాతంగా కలుగకుండా చూసుకోవాలని కోరింది.
ఇవి కూడా చదవండి:
MP Raghunandan Rao: సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌పై నిప్పులు చెరిగిన ఎంపీ రఘునందన్ రావు..
Financial Tips For Newly Weds: కొత్తగా పెళ్లైన వాళ్లు ఫాలో కావాల్సిన ఆర్థిక సూత్రాలు