Share News

CID షో అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ప్రద్యుమన్ ఇకలేనట్లే..

ABN , Publish Date - Apr 06 , 2025 | 10:44 AM

CID Show Pradyuman: నైంటీస్ కిడ్స్‌ను ఎంతగానో అలరించిన సీఐడీ షో సీజన్ 2 ప్రస్తుతం ప్రసారం అవుతోంది. అయితే, గత కొన్ని ఎపిసోడ్ల నుంచి ఏసీపీ ప్రద్యుమన్ క్యారెక్టర్ కనిపించటం లేదు. ఈ నేపథ్యంలోనే సోనీ ఓ భారీ ట్విస్ట్ ఇచ్చింది. ప్రద్యుమన్ పాత్ర చనిపోయినట్లు ప్రకటించింది.

CID షో అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ప్రద్యుమన్ ఇకలేనట్లే..
CID Show

సీఐడీ సీరియల్ గురించి తెలియని బుల్లితెర అభిమానులు ఉండరంటే అతిశయోక్తి లేదు. నైంటీస్ కిడ్స్‌కి బాగా ఇష్టమైన క్రైమ్ షోలలో సీఐడీ ముందు వరుసలో ఉంటుంది. హీందీలో తీసిన ఈ సీరియల్ మిగిలిన భాషల్లో కూడా డబ్ అయింది. తెలుగులో అయితే పిచ్చ క్రేజ్ తెచ్చుకుంది. ప్రతీ ఎపిసోడ్ ఓ ట్విస్ట్‌తో మతిపోయేలా చేస్తుంది. 1998లో మొదలైన ఈ షో ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది. దాదాపు 20 ఏళ్లు పైనే అవుతున్నా.. ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఈ షోలో అందరికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే.. అది ఏసీపీ క్యారెక్టరే.. ఏపీసీ ప్రద్యుమన్ క్యారెక్టర్‌లో శివాజీ సతమ్ జీవించేశారు. అందుకే ఆయన పాత్రకు అంత మంచి గుర్తింపు వచ్చింది.


ప్రస్తుతం సీఐడీ సీజన్ 2 ప్రసారం అవుతోంది. సీజన్ 2కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే, ఏమైందో ఏమో తెలీదు కానీ, ఏసీపీ ప్రద్యుమన్ క్యారెక్టర్‌ను గత కొద్దిరోజులనుంచి దూరంగా ఉంచారు. గత కొన్ని ఎపిసోడ్ల నుంచి ప్రద్యుమన్‌ కనిపించడం లేదు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి టైంలో సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ భారీ ట్విస్ట్‌తో పాటు షాక్ కూడా ఇచ్చింది. సీఐడీ సీజన్ 2లో ఏసీపీ ప్రద్యుమన్ పాత్ర చనిపోయినట్లు ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. సోనీ మీడియాపై రెచ్చిపోయి ట్రోల్స్ చేస్తున్నారు.


అయితే, ప్రద్యుమన్ క్యారెక్టర్‌ను చంపేయడం వెనుక సోనీ మాస్టర్ ప్లాన్ ఉందని హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన విశ్వసనీయ వర్గాల సమాచారం. వారు చెబుతున్న దాని ప్రకారం..‘ సీఐడీ సీజన్ 2కు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావటం లేదు. మంచి స్టోరీ లైన్లు, భారీ తారాగణం ఉన్నా కూడా లాభం లేకుండా పోయింది. మొన్నటి వరకు మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఫిబ్రవరినుంచి ఆ టీఆర్పీ రేటింగ్ తగ్గుతూ వస్తోంది. అందుకే సోనీ ఛానల్ కీలక నిర్ణయం తీసుకుంది. స్టోరీ లైన్‌తో పాటు తారాగణంలో కూడా మార్పులు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే శివాజీ పతమ్ క్యారెక్టర్‌ను క్లోజ్ చేశారు. మరో పాపులర్ వ్యక్తి షోలోకి ఎంట్రీ ఇస్తాడు’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

Indian Air Force: నాలుగు రోజుల్లోనే ఎయిర్ ఫోర్స్‌కు మరో పెద్ద దెబ్బ

US Protest: 'అమెరికాను నాశనం చేయడం ఆపండి'

Updated Date - Apr 06 , 2025 | 10:56 AM