Share News

Viral Mosquitoes News: యువతి పిచ్చి మామూలుగా లేదు.. దోమల్ని చంపి, వాటితో..

ABN , Publish Date - Apr 14 , 2025 | 07:43 AM

Mosquitoes Viral Video: ఓ సినిమాలో బ్రహ్మానందం ఈగల్ని చంపి బ్యాగులో వేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ మాత్రం ఆ యువతి దోమల్ని చంపి వాటితో ఆల్బమ్ క్రియేట్ చేస్తోంది. ఆ ఆల్బమ్‌లో దోమల్ని అతికించింది పేరు, సమయం, ఎక్కడ చంపిందో వివరంగా రాసుకుంటోంది.

Viral Mosquitoes News: యువతి పిచ్చి మామూలుగా లేదు.. దోమల్ని చంపి, వాటితో..
Mosquitoes News

జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అంటారు. మనిషికి మనిషికి మధ్య తినే ఆహారపు అభిరుచుల విషయంలో.. ఆలోచనల విషయంలో తేడాలు ఉంటాయని దానర్థం. అయితే, మనం ఎలా ఆలోచిస్తున్నాం అన్న దాని మీద.. మన మానసికంగా బాగానే ఉన్నామా? చిప్ దొబ్బిందా?.. అన్నది అవతలివాళ్లకు తెలుస్తుంది. సమాజంలో కొంతమందిని చూస్తుంటే.. వాళ్లకు మతి ఉందా? లేదా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. పిచ్చి పలు రకాలు అన్న డైలాగుకు ఓ యువతి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఆమె హాబీ ఏంటో తెలిస్తే.. మీరు నోరెళ్ల బెడతారు. ఇదేం పిచ్చి తల్లీ అని అనకమానరు. ఆ యువతి దోమల్ని చంపి, వాటితో ఓ ఆల్బమ్ తయారు చేస్తోంది.


ఆ ఆల్బమ్‌లో దోమల్ని అతికించి.. పేరు, సమయం, ఎక్కడ చంపిందో వివరంగా రాసుకుంటోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఆ వీడియో ఇప్పటి వరకు ఐదు మిలియన్లకు పైగా వ్యూస్ తెచ్చుకుంది. ఇక, ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘ పిచ్చోళ్ల గురించి వినడమే కానీ, ఇదే లైవ్‌లో మొదటి సారి చూడ్డం’..‘ బంగారు తల్లీ .. చక్కగా చదువుకోవచ్చుగా.. ఇలా దోమల్ని చంపే పనేంటి’..‘ పిచ్చి పలు రకాలు అంటే ఇదేనేమో.. పాపం.. ఆ దోమల ఆత్మకు ఆ దేవుడు శాంతినిచ్చు గాక’.. ‘ ఆ అమ్మాయిని వెంటనే డాక్టర్‌కు చూపించండి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సినిమాలో బ్రహ్మనందం

ఇక్కడ ఈ యువతి దోమల్ని చంపితే.. ఓ సినిమాలో బ్రహ్మానందం ఈగల్ని చంపుతూ ఉంటాడు. చంపిన ఈగల్ని బ్యాగులో వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఈగ కనిపించిందంటే చాలు రెచ్చిపోతాడు. వాటిని చంపనిదే వదలడు. అలా ఓ సారి రేషన్ షాపు దగ్గర గొడవలో ఇరుక్కుంటాడు. అవినీతికి పాల్పడుతున్న రేషన్ షాపు వాళ్లను చితకబాదుతాడు. బ్రహ్మానందం తమ కోసమే అలా చేశాడని జనం అనుకుంటారు. సినిమా క్లైమాక్స్‌లో బ్రహ్మానందం ఎందుకు ఈగల్ని చంపుతున్నాడో చెప్తాడు. ఈగల కారణంగా తల్లి కలరా వచ్చి చనిపోయిందని, అందుకే వాటిని చంపి తల్లి ఆత్మకు శాంతి కలిగిస్తున్నానని అంటాడు.


ఇవి కూడా చదవండి

Monday Tips: సోమవారం ఈ పరిహారాలు చేస్తే చంద్ర దోషం నుండి విమూక్తి..

CM Chandrababu: ఇవాళ సీఎం చంద్రబాబు ఫుల్ బిజీ.. పూర్తి షెడ్యూల్ ఇదే..

Updated Date - Apr 14 , 2025 | 07:59 AM