Share News

ROI on Petrol Pump: పెట్రోల్ బంక్ పెట్టుకుంటే ఏటా రూ.40 లక్షల ఆదాయం.. నెట్టింట పోస్టు వైరల్

ABN , Publish Date - Apr 06 , 2025 | 09:52 PM

పెట్రోల్ బంక్ పెట్టుకుంటే ఏడాదికి రూ.40 లక్షల ఇన్‌కమ్ కళ్ల చూడొచ్చంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టుపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిపై ఏఐ చాట్‌బాట్‌లు కూడా తమ అభిప్రాయాన్ని పంచుకున్నాయి.

ROI on Petrol Pump: పెట్రోల్ బంక్ పెట్టుకుంటే ఏటా రూ.40 లక్షల ఆదాయం.. నెట్టింట పోస్టు వైరల్
Crazy ROI in petrol pump Business

ఇంటర్నెట్ డెస్క్: నెట్టింట ఆసక్తికర చర్చలకు కొదవే లేదు. కానీ కొన్ని మాత్రమే జనాలను అమితంగా ఆకట్టుకుంటూ ట్రెండింగ్‌లో నిలుస్తాయి. అలాంటి ఓ టాపిక్‌పై జనాలు పెద్ద ఎత్తున తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ చర్చలో ఏఐ చాట్‌బాట్‌లు గ్రోక్, పర్‌ప్లెక్సిటీ కూడా పాల్గొనడం ఓ విశేషం.

పెట్రోల్ బంక్‌తో కళ్లు చెదిరే లాభాలు చూడొచ్చంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టుపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. కేవలం రూ.50 లక్షల పెట్టుబడితో ఏటా రూ.40 లక్షల ఆదాయాన్ని పొందొచ్చని అతడు చెప్పుకొచ్చాడు. తన వాదనకు మద్దతుగా కొన్ని లెక్కలు కూడా తెలిపాడు.

మొదటగా పెట్టే పెట్టుబడి: రూ.50 లక్షలు

లీటర్ ఇంధనంపై లాభం: పెట్రోల్‌‌పై రూ.3, డీజిల్‌పై రూ.2.5

రోజు వారి అమ్మకాలు: 5,600 లీటర్లు

రూజువారి ఇన్‌కమ్: రూ. 20 వేలు

నెలకు వచ్చే ఇన్‌కమ్: రూ.6 లక్షలు

నెలవారి ఖర్చులు: రూ.2 లక్షలు

ఏడాదికి నెట్ ఇన్‌కమ్: రూ.40 లక్షలు


ఈ పోస్టు నెట్టింట కాలు పెట్టగానే ఒక్కసారిగా కలకలం రేగింది. జనాలు తమ అభిప్రాయాలను పెద్ద ఎత్తున పంచుకున్నారు. తాను 15 ఏళ్లుగా పెట్రోల్ బంక్‌ల నిర్వహణలో ఉన్నానని, ఈస్థాయి లాభాలు అసాధ్యమని ఓ వ్యక్తి చెప్పుకొచ్చారు. ఔత్సాహిక వ్యాపారులను తప్పుదారి పట్టించడమే అని అన్నారు. ప్రస్తుతం ఇంధన అమ్మకాలు స్థానికంగా ఉన్న పోటీ, ధరల్లో హెచ్చుతగ్గులు వంటి వాటిపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంత మొత్తం రాదని తెలిపారు.

ఈ విషయంపై ఏఐ చాట్‌బాట్‌లు చెప్పిన అభిప్రాయాన్ని కూడా కొందరు పంచుకున్నారు. రూ.40 లక్షల ఆదాయం అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే సాధ్యమని పర్‌ప్లెక్సిటీ ఏఐ పేర్కొన్నట్టు కొందరు తెలిపారు. నిరంతర సేల్స్, పోటీ తక్కువగా ఉండటం వంటివన్నీ సాధ్యం కాదని అన్నారు. ఇక ఓ మధ్యస్థాయి పెట్రోల్ బంకులు రోజుకు 5600 లీటర్ల పెట్రోల్ అమ్మే అవకాశం ఉందని, అదే కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉండే పెట్రోల్ బంకులు మాత్రం రోజుకు పది వేల నుంచి 20 వేల లీటర్ల పెట్రోల్ అమ్ముతాయని పర్‌ప్లెక్సిటీ ఏఐ పేర్కొంది. అయితే ఖర్చులు, పోటీ వంటివన్నీ కూడా అదే స్థాయిలో పెరుగుతాయని వెల్లడించింది.


పెట్రోల్ బంక్‌పై లాభం సంత్సరానికి రూ.16 లక్షలకు మించి ఉండకపోవచ్చని గ్రోక్ అభిప్రాయపడింది. ఇది కూడా పెట్రోల్ బంక్ ఏ ప్రాంతంలో ఉంది?, ఖర్చులు ఏంత మేరకు ఉన్నాయి అన్న అంశాలపై ఆధారపడి ఉంటుందని వెల్లడించింది. అయితే, లీటర్ పెట్రోల్, డిజీల్‌పై పేర్కొన్న లాభం మాత్రం వాస్తవానికి దగ్గరగానే ఉన్నట్టు పేర్కొన్నాయి.

ఇవి కూడా చదవండి:

మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను తిరిగి పొందాలని.. ఆమె తండ్రి అస్థికలు దొంగిలించి..

ఇతరులను టచ్ చేస్తే షాక్.. కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా

దేవుడా..ఇలాంటి డాక్టర్లు కూడా ఉంటారా.. ఈ ప్రిస్క్రిప్షన్ చూస్తే..

Read Latest and Viral News

Updated Date - Apr 06 , 2025 | 09:53 PM