Share News

Viral Video: ఇది కదా స్నేహం అంటే.. అంతక్రియల్లో మందు, సిగరెట్

ABN , Publish Date - Apr 06 , 2025 | 06:54 AM

Viral Video: చనిపోయిన ఫ్రెండ్ అంత్యక్రియలకు స్నేహితులు వచ్చారు. దగ్గరుండి మరీ అన్ని చూసుకున్నారు. అంత్యక్రియల్లో తుది ఘట్టంగా శవాన్ని గొయ్యిలోకి దించారు. అప్పుడు ఓ ఇద్దరు స్నేహితులు గొయ్యిలోకి దిగారు. తర్వాత వారు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: ఇది కదా స్నేహం అంటే.. అంతక్రియల్లో మందు, సిగరెట్
Viral Video

స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఓ మంచి స్నేహితుడు మన జీవితంలో ఉంటే తిరుగే ఉండదు. అయితే, ఈ మధ్య కాలంలో బంధాలు బాగా బలహీనపడిపోయాయి. స్నేహం కూడా ఓ అవసరం అయిపోయింది. అవసరాల కోసం స్నేహం, ప్రేమ నటిస్తున్నవారే ఎక్కువైపోయారు. మనతో అవసరం ఉన్నంత వరకు మనతో ఉంటారు. తర్వాత మనల్ని పట్టించుకోను కూడా పట్టించుకోరు. వాళ్లకు మనం ఉన్నామా? పోయామా? అన్నది కూడా అవసరం లేదు. మనకు కష్టం వచ్చినపుడు ఎప్పుడూ తోడుండరు. అలాగని అందరు స్నేహితులు అలానే ఉంటారని కాదు.


స్నేహమంటే విలువిచ్చే వారు.. స్నేహితుల కోసం ప్రాణాలు ఇచ్చే వారు కూడా లేకపోలేదు. తాజాగా, కొంతమంది స్నేహితులు చనిపోయిన స్నేహితుడికి ఇష్టమైన వాటితో అంతిమ వీడ్కోలు చెప్పారు. అతడి అంత్యక్రియల్ని అందరికీ గుర్తుండిపోయేలా చేశారు. ఇంతకీ వాళ్లు ఏం చేశారంటే.. కొద్దిరోజుల క్రితం ఓ యువకుడు చనిపోయాడు. అతడికి కన్నీళ్లతో వీడ్కోలు చెప్పేందుకు అంత్యక్రియలకు స్నేహితులంతా వచ్చారు. శవాన్ని గొయ్యిలోకి దించారు. అప్పుడు అతడి స్నేహితులు ఇద్దరు గొయ్యిలోకి దిగారు. మందు గ్లాసులో పోసి చనిపోయిన స్నేహితుడి నోట్లో పోశారు.


ఆ తర్వాత సిగరెట్ అంటించి, దాన్ని కూడా నోట్లో పెట్టారు. తర్వాత ఖననం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు..‘ దోస్తు మేరా దోస్త్.. తూహై మేరీ జాన్.. ఇది కదా స్నేహం అంటే’.. ‘ మందు, సిగరెట్‌తో ఏర్పడ్డ స్నేహాలు..వజ్రంకంటే గట్టిగా ఉంటాయి. ఎప్పటికీ విడిపోవు’..‘ స్నేహితులంటే ఇలా ఉండాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే.. ఈ సంఘటన ఎప్పుడు? ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. దక్షిణ భారత దేశంలోనే జరిగినట్లు అంత్యక్రియలను బట్టి తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

CM Revanth Reddy: కంచ గచ్చిబౌలి.. నకిలీ ఫొటోలు, వీడియోలపై.. సీఎం సీరియస్‌

Hyderabad: పోస్టల్‌ ఖాతాలో నెలకు రూ.2500 వేస్తారట..!

Updated Date - Apr 06 , 2025 | 07:10 AM