Share News

Humanoid Robot: మనుషులతో సమానంగా డ్యాన్స్, యాక్టింగ్ ఇరగదీసిన రోబో

ABN , Publish Date - Apr 07 , 2025 | 10:51 AM

Humanoid Robot: టెన్నాలజీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇంకో 50 ఏళ్లు పోతే కలియుగం అనికాకుండా రోబోలయుగం అని పిలవాల్సి వస్తుంది. అంతలా హ్యూమనాయిడ్ రోబోలు మెరుగుపడుతున్నాయి. మనుషులతో సమానంగా పనులు చేస్తున్నాయి.

Humanoid Robot: మనుషులతో సమానంగా డ్యాన్స్, యాక్టింగ్ ఇరగదీసిన రోబో
Humanoid Robot

రోబో సినిమాలో సైంటిస్ట్ వశీకరన్ ఓ హ్యూమనాయిడ్ రోబోను తయారు చేస్తాడు. దానికి చిట్టి అని పేరు పెడతాడు. దాని ప్రతిభ గురించి ప్రపంచానికి చెప్పడానికి ఓ మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. ఆ మీటింగ్‌లో అది తనకు తెలిసిన విద్యలన్నీ అక్కడికి వచ్చిన వారికి చేసి చూపిస్తుంది. తాజాగా, చైనాలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ సోషల్ మీడియా సెలెబ్రిటీ ‘ఐ షో స్పీడ్’ ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నాడు. చైనాలోని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో పర్యటిస్తూ సాహసాలు చేస్తున్నాడు. తాజాగా, హ్యూమనాయిడ్ రోబోట్ల దగ్గరకు వెళ్లాడు. వాటితో కలిసి అదిరిపోయే ఫీట్లు చేశాడు. ఓ రోబోట్ అతడు నడిస్తే.. అతడితో పాటు నడిచింది.


అతడు డ్యాన్స్ చేస్తే .. డ్యాన్స్ చేసింది. ఫైట్లు చేస్తే ఫైట్లు చేసింది. ఆఖరికి బ్యాక్ ఫ్లిప్ కూడా చేసింది. చివర్లో చనిపోయినట్లు టప్ మని నేలపై పడిపోయింది. దాన్ని శవాన్ని తీసుకెళ్లినట్లు అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలు వైరల్‌గా మారాయి. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ చైనా టెక్నాలజీ పరంగా ఇంత ముందంజలో ఉందంటే నమ్మలేకుండా ఉన్నా. రోబోలు మనుషులతో పోటీ పడుతున్నాయి’..‘ ఇంకొన్నేళ్లు పోతే.. మనుషులకు, రోబోలకు తేడా కనుక్కోవటం కష్టం అయిపోతుంది. టెక్నాలజీ అంత అద్భుతంగా మారిపోతుంది’.. ‘ ఈ రోబోలు ఇప్పుడే ఇలా ఉంటే.. 2100లో ఇంకెలా ఉంటాయో’..‘రోబో యాక్టింగ్ ఇరగదీసింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఎవరీ ఐషోస్పీడ్?

ఐషోస్పీడ్ అసలు పేరు డారెన్ వాట్కిన్స్ జూనియర్. ఇతడు అమెరికాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా సెలెబ్రిటీ. 2016లో తన యూట్యూబ్ జర్నీ సాధించాడు. ఇప్పుడు ఒక్క యూట్యూబ్‌లోనే అతడికి 38 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో కూడా పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. మొదట్లో డారెన్ గేమింగ్‌కు సంబంధించిన వీడియోలు చేసేవాడు. తర్వాత రూటు మార్చాడు. ఇప్పుడు అన్ని రకాల వీడియోలు చేస్తున్నాడు. ఇండియాలో కూడా పర్యటించాడు. డారెన్‌ తన ఫాలోయింగ్ కారణంగా తనకు ఇష్టమైన ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఫుట్ బాలర్ రోనాల్డోను సైతం కలిశాడు. డబ్ల్యూడబ్ల్యూఈ సైతం పాల్గొని అందిరినీ ఆశ్చర్యపరిచాడు.

Updated Date - Apr 07 , 2025 | 10:51 AM