Share News

Tooth sticks in Kumbh Mela: ప్రేయసి ఐడియా అదిరిందిగా.. కుంభమేళాలో వేప పుల్లలు.. వేలల్లో సంపాదన..

ABN , Publish Date - Jan 30 , 2025 | 08:23 PM

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు వెళ్తూ పుణ్య స్నానాలు చేస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌కు దాదాపు 45 కోట్ల మంది హాజరవుతారని అంచనా వేశారు. ఇప్పటికే 20 కోట్ల మంది భక్తులు వెళ్లినట్టు అంచనా. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌లో రెండు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేశారు.

Tooth sticks in Kumbh Mela: ప్రేయసి ఐడియా అదిరిందిగా.. కుంభమేళాలో వేప పుల్లలు.. వేలల్లో సంపాదన..
Man selling toothsticks in Maha Kumbh

ప్రపంచంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అయిన కుంభమేళా (Maha Kumbh) ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ (UttarPradesh)లోని ప్రయోగరాజ్‌ (Prayagraj)లో జరుగుతోంది. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు వెళ్తూ పుణ్య స్నానాలు చేస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌కు దాదాపు 45 కోట్ల మంది హాజరవుతారని అంచనా వేశారు. ఇప్పటికే 20 కోట్ల మంది భక్తులు వెళ్లినట్టు అంచనా. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌లో రెండు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేశారు. ఆ వ్యాపారం సంగతి పక్కన పెడితే ఓ కుర్రాడు చాలా సులభంగా వేల రూపాయలు సంపాదిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.


ప్రయాగ్‌రాజ్‌లో వేప పుల్లలు (Neem Sticks) అమ్ముకునే ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో (Viral Video) నెట్టింట వైరల్ అవుతోంది. ఎలాంటి పెట్టుబడి లేకుండా ప్రారంభించిన ఈ వ్యాపారం ద్వారా కేవలం ఐదు రోజుల్లోనే 40 వేల రూపాయలు సంపాదించినట్లు చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. ఎలాంటి పెట్టుబడి లేకుండా వేప చెట్ల నుంచి వందల సంఖ్యలో పుల్లలు తీసుకు వచ్చి కుంభమేళాకు వస్తున్న భక్తులకు వాటిని అమ్ముతున్నాడు. అలా కేవలం 5 రోజుల్లోనే ఆ యువకుడు రూ.30 వేల నుంచి 40 వేల వరకు సంపాదించాడు. తాజాగా కుంభమేళాకు వెళ్లిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ ఈ వేప పుల్లలు అమ్మడాన్ని చూసి ఇంటర్వ్యూ చేశాడు.


కుంభమేళాలో వేప పుల్లలు అమ్మమని తన ప్రేయసి ఐడియా ఇచ్చిందని, ఆమె ఐడియాను ఫాలో కావడంతో ఐదు రోజుల్లోనే అంత డబ్బు సంపాదించానని ఆ కుర్రాడు తెలిపాడు. రూపాయి ఖర్చు లేకుండా వేలు సంపాదించడం చాలా సంతోషంగా ఉందని, కుంభమేళా సాగినన్ని రోజులు ఇవే అమ్ముకుంటానంటూ తెలిపాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన వారు ఆ కుర్రాడి నిజాయితీని ప్రశంసిస్తున్నారు. అంత మంచి ఐడియా ఇచ్చిన అతడి ప్రేయసిని కూడా అభినందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Viral Video: అంకుల్ చెప్పింది వినాలిగా ఆంటీ.. ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో చూడండి..


Optical Illusion: ఈ మనుషుల మధ్యన పిల్లిని కనిపెడితే.. మీ కళ్లు చాలా పవర్‌ఫుల్ అని నమ్మాల్సిందే..


Strange Job: ఓర్నీ.. ఇలా కూడా కోట్లు సంపాదించవచ్చా? ఈ వ్యక్తి జాబ్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే..


Viral Video: స్కూటీ మీద వేగంగా వెళ్తున్న యువతికి అడ్డొచ్చిన బారికేడ్.. ఆమె ఏం చేసిందో చూడండి..


Optical Illusion: మీ కంటి చూపు అద్భుతం అయితే.. ఈ బాత్రూమ్‌లో కారు బొమ్మ ఎక్కడుందో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 30 , 2025 | 08:30 PM