Man Punishes Wife By Adandoning Baby: ప్రసవం తరువాత భార్య దగ్గరకు రానీయలేదని.. పసిబిడ్డను అడవిలో వదిలి..
ABN , Publish Date - Apr 07 , 2025 | 10:00 PM
ప్రసవం తరువాత భార్య దగ్గరకు రానీయకపోవడంతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. రోజుల వయసున్న పసిబిడ్డను అడవిలో వదిలేసే ప్రయత్నం చేశాడు. థాయ్‌లాండ్‌లో ఈ దారుణం వెలుగు చూసింది.

ఇంటర్నెట్ డెస్క్: థాయ్‌లాండ్‌లో తాజాగా షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రసవం అయిన కొన్ని రోజులకే భార్యకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి ఆమె నిరాకరించడంతో దారుణానికి ఒడిగట్టాడు. పసిబిడ్డను అడవిలో పారేసేందుకు ప్రయత్నించాడు. భార్యపై ప్రతీకారంగా ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
వుట్టిచాయ్ అనే యువకుడికి 21 ఏళ్లు. అతడి భార్యకు 22 ఏళ్లు. ఇటీవలే ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ప్రసవం అయిన కొద్ది రోజులకే ఆమెకు దగ్గరయ్యేందుకు అతడు ప్రయత్నించగా ఆమె నిరాకరించింది. దీంతో, భార్యపై కోపం పెంచుకున్న అతడు కన్నబిడ్డను అడవిలో వదిలేసి ఆమెపై రివెంజ్ తీర్చుకుందామని అనుకున్నాడు. ఈ క్రమంలో బిడ్డను తీసుకెళ్లిపోయాడు.
ఓ చెట్టుకింద బిడ్డను పడుకోబెట్టి ఫొటో తీసి భార్యకు పంపించాడు. అప్పటికి ఆమె తన స్నేహితురాలి ఇంట్లో ఉంది. బిడ్డకు వదిలించున్నట్టు అర్ధం వచ్చేలా అతడు పంపిన మెసేజ్ చూసి ఆమె నిర్ఘాంతపోయింది. వెంటనే ఆ మెసేజీని గ్రామపెద్దకు పంపించింది. తమ మధ్య జరిగిన చర్చ తాలూకు స్క్రీన్ షాట్‌లు కూడా పంచుకుంది. ఈ లోపు వుట్టిచాయ్ తన బిడ్డకు ఎలాంటి హానీ తలపెట్టకుండా వెనక్కు తీసుకొచ్చాడు.
బిడ్డను వదిలించుకునే ఉద్దేశమే తనకు లేదని బుకాయించే ప్రయత్నం చేశాడు. కానీ అతడి భార్య మాత్రం వుట్టిచాయ్ మద్యానికి బానిసయ్యాడని పోలీసులకు తెలిపింది. గ్యాంబ్లింగ్‌కు పాల్పడే వాడని, తనతో పాటు తన సంవత్సరన్న బిడ్డపై కూడా హింసించేవాడని చెప్పింది. దీంతో, పోలీసులు అతడికి వైద్య పరీక్షలు నిర్వహించగా శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించాయి.
మరోవైపు, భార్య చేసిన ఆరోపణలను మాత్రం వుట్టిచాయి కొట్టిపారేశాడు. భార్యతో ఊరికే అలా అన్నానని, తనకా ఉద్దేశం లేదని చెప్పే ప్రయత్నం చేశాడు. పోలీసులు మాత్రం అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేరం రుజువైన పక్షంలో అతడికి స్థానిక చట్టాల ప్రకారం, మూడేళ్ల కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. మరోవైపు, స్థానికంగా అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఇవి కూడా చదవండి:
మాజీ బాయ్‌ఫ్రెండే కాబోయే మామగారు.. యువతి లైఫ్‌లో వింత ట్విస్ట్
తల్లి హృదయం ఎంత గొప్పది.. చిరుత దాడిలో గాయపడ్డా లెక్క చేయక ఈ తల్లి శునకం..
రూల్స్‌కు విరుద్ధంగా చీతాల దాహం తీర్చినందుకు అటవీ శాఖ సిబ్బందిపై వేటు