Couple Viral Video: మేడపై రీల్ చేస్తున్న భార్య.. వద్దంటూ గొడవకు దిగిన భర్త.. చివరకు జరిగిందేంటో చూస్తే..
ABN , Publish Date - Apr 15 , 2025 | 06:48 PM
ఓ మహిళ.. చేతిలో ఫోన్ పట్టుకుని ఇంటిపై నిలబడి రీల్ చేస్తుంటుంది. ఇది గమనించిన భర్త.. ఆగ్రహంతో ఇంటి పైకి ఎక్కి గొడవపడతాడు. ఎప్పుడు చూసినా ఈ రీల్స్ గోల ఏంటీ.. అంటూ ఆమెను పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

భార్యాభర్తల మధ్య నిత్యం అనేక రకాల గొడవలు జరగడం సర్వసాధారణం. ఇలాంటి గొడవలు కొన్నిసార్లు చాలా దూరం వెళ్తుంటాయి. ఇలాంటి సమయాల్లో భర్తలు భార్యలపై దాడి చేసి తమ రాక్షసత్వాన్ని చూపిస్తుంటారు. అయితే కొన్నిసార్లు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ ఇంటిపై రీల్ చేస్తుండగా.. భర్త వద్దంటూ గొడవపడతాడు. ఈ క్రమంలో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ చేతిలో ఫోన్ పట్టుకుని ఇంటిపై నిలబడి రీల్ చేస్తుంటుంది. ఇది గమనించిన భర్త.. ఆగ్రహంతో ఇంటి పైకి ఎక్కి గొడవపడతాడు. ఎప్పుడు చూసినా ఈ రీల్స్ గోల ఏంటీ.. అంటూ ఆమెను పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తోపులాట జరుగుతుంది.
Funny Mosquito Video: దోమలపై మరీ ఇంత కోపమా.. ఎలా చంపుతున్నాడో చూస్తే అవాక్కవుతారు..
భర్త తనను అడ్డుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన భార్య.. చేతిలోని ఫోన్‌ను నేలకేసి కొట్టి, (Wife pushes husband off the roof of house) అతన్ని ఒక్క తోపు తోసేస్తుంది. దెబ్బకు ఆ భర్త.. ధబేల్‌మని ఇంటి ముందున్న కర్రల పందిరిలో నుంచి దూసుకుని వచ్చి కిందపడతాడు. నొప్పి తట్టుకోలేక అటూ, ఇటూ దొర్లుతూ విలవిల్లాడిపోతాడు. ఇలా రీల్ వద్దన్నందుకు భర్తను ఇంటి పైనుంచి కిందకు తోసిన భార్యను చూసి అంతా అవాక్కవుతున్నారు.
Elephant VS Lions: సింహాలు గుంపులుగా ఉంటే.. సింగిల్‌గా వచ్చిన ఏనుగు.. చివరకు చూడగా..
ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈమేంటీ మరీ డేంజర్‌లా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘రీల్ వద్దన్నందుకు ఎంత పని చేసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 250కి పైగా లైక్‌లు, 37 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..