Woman Funny Video: ఎలాగైనా ఎక్కి తీరాల్సిందే.. ఎక్సలేటర్‌పై ఈమె నిర్వాకం చూస్తే..
ABN , Publish Date - Feb 21 , 2025 | 09:17 PM
పల్లెటూర్ల నుంచి నగరాలకు వచ్చే వారు బస్సు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్‌లో ఇబ్బందులు పడడం చూస్తుంటాం. తాజాగా, ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఎక్సలేటర్ ఎక్కేందుకు వెళ్లిన మహిళ.. అందరిలా కాకుండా..

కొందరు తెలిసి చేసే పనులు, మరికొందరు తెలీక చేసే పనులు.. అందరినీ తెగ ఆకట్టుకుంటుంటాయి. అలాగే మరికొన్నిసార్లు ఇవే పనులు అందరికీ తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ ఎక్సలేటర్ ఎక్కుతుండగా తమాషా సంఘటన చోటు చేసుకుంది.. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పల్లెటూర్ల నుంచి నగరాలకు వచ్చే వారు బస్సు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్‌లో ఇబ్బందులు పడడం చూస్తుంటాం. తాజాగా, ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఎక్సలేటర్ (Accelerator) ఎక్కేందుకు వెళ్లిన మహిళ (woman).. అందరిలా కాకుండా ఎక్సలేటర్‌ను రివల్స్‌లో ఎక్కేందుకు ప్రయత్నిస్తుంది.
Viral Video: మామిడి కాయలు కోస్తూ ట్రాన్స్‌ఫార్మర్‌పై పడిపోయిన బాలుడు.. చివరకు ఏమైందో చూడండి..
ఎక్సలేటర్ పైనుంచి కిందకు వస్తుండగా.. ఈమె మాత్రం కింద నుంచి పైకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. దీంతో ఆమె ఎన్నిసార్లు అడుగులు వేసినా పైకి వెళ్లలేక.. అక్కడే ఉండిపోతుంది. ఆమె మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా ఎక్సలేటర్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈమె నిర్వాకం చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివి రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. పాపం.. ఈమె మరీ అమాయకంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘వీడియో తీయకపోతే.. వెళ్లి ఆమెకు సాయం చేయొచ్చుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1400కి పైగా లైక్‌లు, 58 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
ఇవి కూడా చదవండి..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..