Share News

Viral Video: మామిడి కాయలు కోస్తూ ట్రాన్స్‌ఫార్మర్‌పై పడిపోయిన బాలుడు.. చివరకు ఏమైందో చూడండి..

ABN , Publish Date - Feb 21 , 2025 | 08:37 PM

ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లాడు మామిడి పండ్లు కోయడానికి చెట్టు ఎక్కాడు. చెట్టుపై పండ్లు కోస్తుండగా.. మధ్యలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉన్నట్టుండి కాలు జారి..

Viral Video: మామిడి కాయలు కోస్తూ ట్రాన్స్‌ఫార్మర్‌పై పడిపోయిన బాలుడు.. చివరకు ఏమైందో చూడండి..

పిల్లలు తెలిసీ తెలీక చేసే పనులు కొన్నిసార్లు ప్రాణాల మీదకు వచ్చి పడుతుంటాయి. చాలా మంది పిల్లలు ఆడుకునే సమయంలో ప్రమాదాల బారిన పడడం చూస్తుంటాం. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు అదృష్టం బాగుండి.. ప్రాణాపాయం నుంచి క్షేమంగా బయటపడుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ బాలుడు మామిడి కాయలు కోస్తూ ప్రమాదవశాత్తు ట్రాన్స్‌ఫార్మర్‌పై పడిపోయాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..


ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లాడు మామిడి పండ్లు కోయడానికి చెట్టు ఎక్కాడు. చెట్టుపై పండ్లు కోస్తుండగా.. మధ్యలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉన్నట్టుండి కాలు జారి.. ధబేల్‌మని (boy fell from mango tree onto transformer) కింద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌పై పడిపోయాడు.

Marriage Viral Video: ఆకతాయి పనులంటే ఇవే.. పెళ్లి ఊరేగింపులో ఇతను చేసిన పని చూస్తే.. షాకవ్వాల్సిందే..


ట్రాన్స్‌ఫార్మర్ మధ్యలో పడిపోయిన బాలుడికి ఏమీ కాలేదు. ఆ పక్కనే మంటలు చెలరేగుతున్నా కూడా బాలుడు మాత్రం క్షేమంగా ఉన్నాడు. ఏడుస్తూ కేకలు పెట్టడంతో అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు గమనించారు. చివరకు వారంతా అక్కడికి చేరకుని, బాలుడిని రక్షించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Robot Viral Video: ఇది రోబోనా లేక మనిషా.. ఎలా పని చేస్తుందో చూస్తే.. ముక్కున వేలేసుకుంటారు..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బాలుడు క్షేమంగా ఉంటాడని ఆకాంక్షిస్తున్నాం’’.. అంటూ కొందరు, ‘‘అయ్యో.. పాపం.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‌లు, 1.42 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..


ఇవి కూడా చదవండి..

Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 21 , 2025 | 08:37 PM