Chennai: ఏడు పదుల వయసులో నీటిపై తేలుతూ యోగా..
ABN , Publish Date - Feb 25 , 2025 | 07:08 AM
జిల్లా ఆళ్వార్ తిరునగరి ప్రాంతానికి చెందిన షణ్ముగసుందరం(Shanmuga Sundaram) ఏడుపదుల దాటిన వయస్సులో భావితరాలకు యోగాపై అవగాహన కల్పించేలా తామ్రభరణిలో నీటిపై తేలియాడుతూ యోగా చేసి అందరిని ఆకట్టుకుంటున్నారు.

చెన్నై: తూత్తుకుడి(Tuttukudi) జిల్లా ఆళ్వార్ తిరునగరి ప్రాంతానికి చెందిన షణ్ముగసుందరం(Shanmuga Sundaram) ఏడుపదుల దాటిన వయస్సులో భావితరాలకు యోగాపై అవగాహన కల్పించేలా తామ్రభరణిలో నీటిపై తేలియాడుతూ యోగా చేసి అందరిని ఆకట్టుకుంటున్నారు. 72 యేళ్ల షణ్ముగసుందరం హెడ్మాస్టర్‌గా పనిచేసి రిటైరయ్యారు. అప్పటి నుంచి ఆయన విద్యార్థులకు ఉచితంగా యోగం, కర్రసాము తదితర ఆత్మరక్షణ కళలను నేర్పిస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Shivaratri: నేటి నుంచి శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు..
ఈ నేపథ్యంలో పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాల వల్ల తామ్రభరణి కాలుష్యం ఏర్పడుతుండటం గమనించి, ఆ నదిని కాలుష్యం బారి నుండి కాపాడేలా ఆ నదిలో తేలియాడుతూ జలయోగ సూర్య నమస్కరం చేసి స్థానికుల అభినందనలు అందుకున్నారు. అదే సమయంలో చిన్నారులకు ఈత కూడా నేర్పుతున్నారు. తాజాగా విద్యార్థులు, స్థానికుల సమక్షంలో తామ్రభరణి నదిపై తేలియాడుతూ వివిధ యోగాసనాలను చేస్తూ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా షణ్ముగసుందరం మాట్లాడుతూ యోగాభ్యాసం చిన్నారులకు అత్యంత అవసరమని, అదే విధంగా పిన్నవయస్సులోనే ఈత నేర్చుకోవాలని, కర్రసాము మంచి ఆత్మరక్షణ కళ అని అందువల్లే తాను నీటిపై తరచూ తేలియాడుతూ యోగాసనాలు వేస్తున్నానని వివరించారు.
ఈవార్తను కూడా చదవండి: Tirupati Court: ఏఆర్ డెయిరీ ఎండీకి చుక్కెదురు
ఈవార్తను కూడా చదవండి: మేళ్లచెర్వులో మొదలైన జాతర సందడి
ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: బీఆర్‌ఎస్‌తో రేవంత్ కుమ్మక్కు
ఈవార్తను కూడా చదవండి: బాసరలో కిటకిటలాడుతున్న క్యూ లైన్లు, అక్షరాభ్యాస మండపాలు
Read Latest Telangana News and National News