IPL 2025: పంతం నెరవేర్చుకున్న బీసీసీఐ.. లీగ్ నుంచే పంపించేశారు
ABN , Publish Date - Apr 04 , 2025 | 11:07 AM
Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ కగిసో రబాడ ఐపీఎల్ తాజా ఎడిషన్ నుంచి తప్పుకున్నాడు. అయితే భారత క్రికెట్ బోర్డే అతడ్ని ప్లాన్ చేసి ఇంటికి పంపించిందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుత క్రికెట‌్‌లో భారత క్రికెట్ బోర్డుతో పెట్టుకోవాలంటే అంతా భయపడతారు. అత్యంత శక్తిమంతమైన బీసీసీఐ అంటే అందరికీ హడల్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌లోనూ మన బోర్డు ఏం చెబితే అదే ఫైనల్ అని అంటుంటారు. అలాంటి బీసీసీఐపై ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేసి ఇరుకున పడ్డాడు సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న ఈ స్పీడ్‌స్టర్.. చిన్న తప్పుతో ఏకంగా క్యాష్ రిచ్ లీగ్ నుంచి తప్పుకున్నాడు. మరి.. తప్పు ఎవరిది.. రబాడను ప్లాన్ చేసి పంపించేశారా.. అసలేం జరిగింది.. అనేది ఇప్పుడు చూద్దాం..
ప్రశ్నించిన పాపానికి..
ఈ ఐపీఎల్ ఆరంభంలో అన్నీ ఫ్లాట్ పిచ్‌లే దర్శనమిచ్చాయి. మొదట్లో దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో 200 పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. దీంతో జీటీకి ఆడుతున్న రబాడ సీరియస్ అయ్యాడు. ఇది క్రికెట్ కాదని, బ్యాటర్ల గేమ్‌గా పేరు మార్చాలని సెటైర్ వేశాడు. బంతికి, బ్యాట్‌కు మధ్య సమతూకం లేకపోవడం కరెక్ట్ కాదని.. ఇలాగేనా టోర్నీని నిర్వహించేది అంటూ విమర్శించాడు. దీంతో ఆ తర్వాతి మ్యాచ్‌లో అతడ్ని జీటీ ఆడించలేదు. అక్కడితో ఆగలేదు. నెక్స్ట్ డే రబాడ స్వదేశానికి పయనమయ్యాడని, పర్సనల్ రీజన్స్ వల్ల అతడు టోర్నీ నుంచి వైదొలిగాడని స్పష్టం చేసింది.
ఆ కోపంతోనే..
స్వదేశానికి వెళ్లిపోయిన రబాడ తిరిగి ఎప్పుడు వస్తాడు.. అసలు వస్తాడా లేదా.. అనేది గుజరాత్ టీమ్ మేనేజ్‌మెంట్ క్లారిటీ ఇవ్వలేదు. రబాడ గనుక తిరిగి రాకపోతే అతడి స్థానంలో సౌతాఫ్రికాకు చెందిన గెరాల్డ్ కొయెట్జీ లేదా ఆఫ్ఘానిస్థాన్ ఆల్‌రౌండర్ కరీం జనత్‌లో ఒకరి మీద జీటీ ఆధారపడొచ్చు. కాగా, పిచ్‌లపై విమర్శలు చేసినందువల్లే అతడ్ని టార్గెట్ చేసి మరీ బీసీసీఐ ఇంటికి పంపించిందని సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. ప్రశ్నించిన పాపానికి టీమ్‌కు దూరం చేయడమే గాక.. ఏకంగా టోర్నీ నుంచి వైదొలిగేలా చేశారని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో రబాడ లేదా జీటీ మేనేజ్‌మెంట్ నుంచి క్లారిటీ వస్తే గానీ చెప్పలేం.
ఇవీ చదవండి:
ఆ అమ్మాయే.. నా గాళ్‌ఫ్రెండ్: ధవన్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి