Team India: టీమిండియా స్టార్లకు కలసిరాని మ్యారేజ్.. సోలో బతుకే సో బెటర్
ABN, Publish Date - Jan 04 , 2025 | 06:48 PM
ఎవరి జీవితంలోనైనా పెళ్లి అనేది చాలా ముఖ్యమైన వేడుక. వివాహ బంధం అనేది కలకాలం నిలిచిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలవాలని భావిస్తారు. కానీ కొన్ని బంధాలకు మధ్యలోనే బీటలు వారతాయి. పెళ్లైన కొన్నేళ్లకే విడిపోతుంటారు. ఇందుకు క్రికెటర్లు కూడా మినహాయింపేమీ కాదు.
ఎవరి జీవితంలోనైనా పెళ్లి అనేది చాలా ముఖ్యమైన వేడుక. వివాహ బంధం అనేది కలకాలం నిలిచిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలవాలని భావిస్తారు. కానీ కొన్ని బంధాలకు మధ్యలోనే బీటలు వారతాయి. పెళ్లైన కొన్నేళ్లకే విడిపోతుంటారు. నూరేళ్లు కలసి జీవితాన్ని పంచుకుందామని ప్రామిస్ చేసుకున్న వాళ్లు విడాకులతో దూరమైపోతున్నారు. వివాహ బంధంతో ఒక్కటైన వారు.. డివోర్స్‌తో ఎవరి జీవితాలు వాళ్లు అన్నట్లు తయారవుతున్నారు. ఇందుకు క్రికెటర్లు కూడా మినహాయింపేమీ కాదు. చాలా మంది స్టార్ కపుల్ మ్యారేజ్ తర్వాత కొన్నాళ్లకే విడాకులు తీసుకుంటున్నారు. టీమిండియాలోనూ ఇదే ట్రెండ్ నడుస్తోంది. పెళ్లి చాలా మంది స్టార్లకు కలసిరావడం లేదు. దీంతో సోలో బతుకే సో బెటర్ అంటూ పాటలు పాడుకుంటున్నారు భారత ఆటగాళ్లు. వాళ్లు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
దినేశ్ కార్తీక్
ఈ ఏడాది ఐపీఎల్‌తో అన్ని రకాల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు వికెట్ కీపర్, బ్యాటర్ దినేష్ కార్తీక్. క్రికెట్‌లో ఎన్నో అపురూప విజయాలు చూసిన ఈ తమిళనాడు బ్యాట్స్‌మన్ మ్యారేజ్ లైఫ్ ఓ రోలర్‌కోస్టర్ రైడ్ లాంటిదని చెప్పొచ్చు. 2007లో నిఖితా వంజరను పెళ్లాడాడు కార్తీక్. అయితే భేదాభిప్రాయాలు రావడంతో 2012లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఆ తర్వాత కొన్నాళ్లకు మరో తమిళనాడు క్రికెటర్, భారత మాజీ ఓపెనర్ మురళీ విజయ్‌ను నిఖితా పెళ్లాడటం. విడాకుల తర్వాత కఠిన దశను ఎదుర్కొన్న డీకే.. ఒకదశలో సూసైడ్ వరకు వెళ్లాడు. ఎలాగోలా దాని నుంచి కోలుకున్నాడు. అనంతరం ప్రముఖ స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్‌ను ప్రేమించి 2015లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు కబీర్, జియాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
శిఖర్ ధావన్
టీమిండియా వెటరన్ బ్యాటర్ శిఖర్ ధావన్ కూడా వైవాహిక జీవితంలో సక్సెస్ కాలేకపోయాడు. అయేషా ముఖర్జీని ప్రేమించి పెళ్లాడాడీ డాషింగ్ లెఫ్టాండర్. చాన్నాళ్ల పాటు కలసి ఉన్నారు. అయితే 2023లో వీళ్లిద్దరూ విడిపోయారు. వీళ్లకు జొరావర్ అనే కుమారుడు ఉన్నాడు. డివోర్స్ తీసుకోవడంతో ధావన్ కొడుకు ఆయేషా వద్దే అంటున్నాడు. అతడ్ని ఎంతో మిస్ అవుతున్నానంటూ అప్పుడప్పుడూ నెట్టింట పోస్టులు పెట్టి తన బాధను పంచుకుంటూ ఉంటాడు ధావన్.
మహ్మద్ షమి
టీమిండియా వెటరన్ స్పీడ్‌స్టర్ మహ్మద్ షమి కూడా వైవాహిక జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. భార్య హసీన్ జహాన్‌తో చాన్నాళ్లు అతడు కలసి ఉన్నాడు. అయితే ఆ తర్వాత భేదాభిప్రాయాలు, పలు సమస్యలు రావడంతో వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. 2020లో ఈ స్టార్ కపుల్ విడిపోయారు. అప్పటి నుంచి షమి ఒంటరిగానే ఉంటున్నాడు.
హార్దిక్ పాండ్యా
సెర్బియన్ మోడల్ నటాసా స్టాంకోవిక్‌ను ప్రేమించి పెళ్లాడాడు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. ఈ బ్యూటిఫుల్ పెయిర్‌కు అగస్త్య అనే కొడుకు పుట్టాడు. అయితే నాలుగేళ్ల పాటు కలసి ఉన్న స్టార్ కపుల్.. గతేడాది తాము విడిపోతున్నట్లు ప్రకటించారు.
యుజ్వేంద్ర చాహల్
టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సతీమణి ధనశ్రీ వర్మ ఫొటోలను అతడు డిలీట్ చేయడం.. చాహల్-ధనశ్రీ ఒకర్నొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో డివోర్స్ వార్తలకు మరింత బలం చేకూరింది. వాళ్లిద్దరూ విడాకులు తీసుకోవడం ఖాయం, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు కాస్త సమయం పడుతుందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.
ఇవీ చదవండి:
టీమిండియా గేమ్ ఓవర్.. రాజు లేని రాజ్యం అయిపోయింది..
సింగిల్ కష్టమైన చోట సిక్సుల వర్షం.. పంత్ మాస్ బ్యాటింగ్
రిటైర్మెంట్ గురించి రోహిత్ శర్మ సంచలన ప్రకటన..
మ్యాచ్ మధ్యలో నుంచి హఠాత్తుగా బయటకు.. అసలు బుమ్రాకు ఏమైంది..
మరిన్ని క్రీడా వార్తలు, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 04 , 2025 | 06:54 PM