Ranji Trophy 2025: రంజీ ట్రోఫీ.. రోహిత్ టీమ్ ఘోర ఓటమి
ABN , Publish Date - Jan 25 , 2025 | 03:30 PM
Mumbai vs Jammu And Kashmir: రంజీ ట్రోఫీలో రోహిత్ శర్మ టీమ్ ఘోర పరాజయం పాలైంది. జమ్మూ కశ్మీర్ చేతుల్లో అతడి జట్టు దారుణంగా ఓడిపోయింది. దీన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇంటర్నేషనల్ క్రికెట్‌లో వరుస వైఫల్యాలు చూస్తున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ల్లో అటు బ్యాటర్‌గా, ఇటు సారథిగా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఆ వైఫల్యాల నుంచి బయటపడేందుకు రంజీలను ఆశ్రయించాడు హిట్‌మ్యాన్. అయితే అక్కడా అతడికి చేదు అనుభవం ఎదురైంది. ముంబై తరఫున బరిలోకి దిగిన రోహిత్.. బ్యాటర్‌గా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఫెయిల్ అయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లు మెరుపులు మెరిపించాడు. అయితే అతడి టీమ్ దారుణంగా ఓటమిపాలైంది.
అసాధ్యం సుసాధ్యమైన వేళ..
జమ్మూ కశ్మీర్ చేతుల్లో 5 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది ముంబై. రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్, అజింక్యా రహానె, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబె, శార్దూల్ ఠాకూర్, కోటియన్ లాంటి స్టార్లతో నిండిన జట్టును కశ్మీర్ లాంటి చిన్న జట్టు ఓడించడం మామూలు విషయం కాదు. చారిత్రాత్మక విజయంతో కశ్మీర్ ఆటగాళ్లు సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. ఒకర్నొకరు హగ్ చేసుకొని సంబురాలు చేసుకున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో ముంబై విసిరిన 205 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది కశ్మీర్. శుభమ్ ఖజూరియా (45), వివ్రాంత్ శర్మ (38)తో పాటు ఆఖర్లో అబీబ్ ముస్తాక్ (32) కీలక ఇన్నింగ్స్‌లతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.
ఇవీ చదవండి:
ఆర్సీబీపై కుల్దీప్ సెటైర్.. అంత మాట అనేశాడేంటి
నేను రోహిత్‌లా కాదు.. ఆ పని చేయను: సూర్యకుమార్
రెండో టీ20కి ముందు భారత్‌కు బిగ్ షాక్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి