Share News

Jasprit Bumrah: బుర్ర వాడకపోతే కెరీర్ షెడ్డుకే.. బుమ్రాపై ఆసీస్ లెజెండ్ సీరియస్

ABN , Publish Date - Mar 15 , 2025 | 01:24 PM

IPL 2025: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాపై ఓ ఆసీస్ లెజెండ్ సీరియస్ అయ్యాడు. స్మార్ట్‌గా వ్యవహరించకపోతే బుమ్రాకు ప్రమాదం తప్పదని హెచ్చరించాడు. ఇంతకీ ఎవరా కంగారూ దిగ్గజం.. ఆయన అసలు ఏమన్నాడు.. అనేది ఇప్పుడు చూద్దాం..

Jasprit Bumrah: బుర్ర వాడకపోతే కెరీర్ షెడ్డుకే.. బుమ్రాపై ఆసీస్ లెజెండ్ సీరియస్
Jasprit Bumrah

క్రికెట్‌లో గాయాలు సహజమే. జెంటిల్మన్ గేమ్‌లో ఇంజ్యురీలు కామన్. ముఖ్యంగా పేస్ బౌలర్లు ఎక్కువగా గాయాల బారిన పడుతుంటారు. ఇలా ఇంజ్యురీ బారిన పడిన కొందరు ఆటగాళ్లు తిరిగి మునుపటి స్థాయిలో రాణించలేక కనిపించకుండా పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో భారత పేసర్లు ఇలాగే గాయాల పాలవుతున్నారు. వెటరన్ పేసర్ ఇంజ్యురీ తర్వాత రీఎంట్రీ ఇచ్చి రాణించాడు. పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఇప్పుడు రికవరీ స్టేజ్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడ్ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కంగారూ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్. ఇంతకీ అతడు ఏమన్నాడంటే..


ఫోకస్ చేయాలె

వెన్ను నొప్పి కారణంగా చాంపియన్స్ ట్రోఫీకి పూర్తిగా దూరమయ్యాడు బుమ్రా. ఇంకా ఫుల్‌గా రికవర్ కాకపోవడంతో ఐపీఎల్‌-2025లో ఆరంభ మ్యాచులకు అతడు దూరమయ్యే చాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆసీస్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుర్ర వాడకపోతే బుమ్రా కెరీర్ షెడ్డుకే అని హెచ్చరించాడు. అతడు స్మార్ట్‌గా ఉండాలని.. తన శరీరాన్ని కాపాడుకోవడంపై ఫోకస్ చేయాలని సూచించాడు. భారత జట్టుకు బుమ్రా అవసరం ఎంతగానో ఉందని స్పష్టం చేశాడు.


వర్కౌట్ కాదు

‘బుమ్రా తన శరీరం మీద ఎక్కువ ఒత్తిడి పెడతాడు. గాయాల బారిన పడకుండా కొన్నిసార్లు బాగానే మేనేజ్ చేశాడు. కానీ బ్యాడ్ లక్. ప్రతిసారీ అలా చేయడం వర్కౌట్ కాదు. ఇంజ్యురీ నుంచి రికవర్ అయి తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుందో అతడికి బాగా తెలుసు. జిమ్‌లో ఎంత సేపు శ్రమించాలనేదీ బుమ్రాకు ఐడియా ఉంది. అతడు ఇప్పుడు కుర్రాడేమీ కాదు. ఇక మీదట అతడు మరింత తెలివిగా, జాగ్రత్తగా వ్యవహరించాలి. గ్రౌండ్‌లోనే కాదు.. బయట కూడా మరింత కష్టపడాలి’ అని మెక్‌గ్రాత్ సూచించాడు.


ఇవీ చదవండి:

కూర్చున్న కొమ్మ నరుక్కుంటున్న రాహుల్

గ్రౌండ్‌లో బూతులు.. రోహిత్ కావాలనే తిడతాడా..

వరుణ్‌కు చంపేస్తామని బెదిరింపులు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 15 , 2025 | 01:29 PM