Share News

KKR vs MI: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్‌లో ఇదే ఫస్ట్ టైమ్

ABN , Publish Date - Apr 01 , 2025 | 10:02 AM

IPL 2025: ముంబై ఇండియన్స్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. వరుస పరాజయాలతో డీలాపడిన రోహిత్ టీమ్.. ఎట్టకేలకు విక్టరీతో అభిమానులకు ఊరట కలిగించింది.

KKR vs MI: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్‌లో ఇదే ఫస్ట్ టైమ్
KKR vs MI

ముంబై ఇండియన్స్ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. టీమ్ నిండా స్టార్లు ఉన్నా.. ఈ ఐపీఎల్‌ను పరాజయాలతో ప్రారంభించింది ఎంఐ. ఆడిన మొదట్రెండు మ్యాచుల్లో ఓడి అభిమానులను నిరాశకు గురిచేసింది. అయితే మొత్తానికి సక్సెస్ ట్రాక్ ఎక్కింది. వాంఖడే స్టేడియం వేదికగా సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది ముంబై. ఇంకో 43 బంతులు ఉండగానే టార్గెట్‌ను చేరుకొని నెట్‌ రన్‌రేట్ కూడా మెరుగుపర్చుకుంది. ఇదే క్రమంలో ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది ఎంఐ. అదేంటో ఇప్పుడు చూద్దాం..


తొలి మ్యాచ్‌తోనే..

ఐపీఎల్ హిస్టరీలో ఒకే వేదికలో అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఎంఐ తమ హోమ్ గ్రౌండ్ వాంఖడే మైదానంలో 53 గెలుపులు నమోదు చేసింది. ఇన్నేళ్ల క్యాష్ రిచ్ లీగ్ హిస్టరీలో ఏ టీమ్ కూడా ఒక మైదానంలో ఇన్నిసార్లు గెలవలేదు. ఆ లెక్కన ముంబై ఒకే వేదికలో మోస్ట్ విన్స్ సాధించిన జట్టుగా నెవర్ బిఫోర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఐపీఎల్ లేటెస్ట్ ఎడిషన్‌‌లో బోణీ కొట్టిన తొలి మ్యాచ్‌తోనే ముంబై అద్భుతమైన ఫీట్ అందుకోవడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో 4 వికెట్లతో రఫ్ఫాడించిన డెబ్యూ పేసర్ అశ్వనీ కుమార్‌కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు లభించింది. అతడు అజింక్యా రహానేతో పాటు రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్, మనీష్ పాండేను ఔట్ చేశాడు.


ఇదీ చదవండి:

పరాగ్‌కు రూ.12 లక్షల జరిమానా

సచిన్‌ నేరుగా సెమీస్‌కు

పటౌడీ ట్రోఫీకి రిటైర్మెంట్‌?

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం చదవండి

Updated Date - Apr 01 , 2025 | 10:02 AM