LSG vs GT Toss: టాస్ నెగ్గిన లక్నో.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..
ABN , Publish Date - Apr 12 , 2025 | 03:06 PM
IPL 2025 Live Score: అభిమానులను ఫుల్ ఎగ్జయిట్ చేసిన లక్నో-గుజరాత్ మ్యాచ్ మొదలైంది. ఈ పోరులో టాస్ గెలిచాడు ఎల్‌ఎస్‌జీ సారథి రిషబ్ పంత్. మరి.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌లో మరో ఎగ్జయిటింగ్ మ్యాచ్ మొదలైపోయింది. గుజరాత్ టైటాన్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ స్టార్ట్ అయింది. వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో డామినేషన్ కొనసాగిస్తున్న ఈ ఇరు జట్లు ఏకనా స్టేడియంలో తలపడుతున్నాయి. ఈ పోరులో టాస్ నెగ్గిన ఎల్‌ఎస్‌జీ కెప్టెన్ రిషబ్ పంత్ తొలుత బౌలింగ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. దీంతో గిల్ సేన మొదట బ్యాటింగ్‌కు దిగనుంది. విధ్వంసక ఓపెనర్ మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదని పంత్ క్లారిటీ ఇచ్చాడు. కూతురు అనారోగ్యంగా ఉండటంతో మార్ష్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని తెలిపాడు.
ఇవీ చదవండి:
జీటీకి షాక్.. తోపు ప్లేయర్ దూరం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి