IPL 2025 Pat Cummins: సన్‌రైజర్స్‌ను ఓడిస్తున్న కమిన్స్.. ఈ 5 తప్పులే సాక్ష్యం
ABN , Publish Date - Apr 07 , 2025 | 02:23 PM
Indian Premier League: ఐపీఎల్-2025లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టు.. ఇప్పుడు పాయింట్స్ టేబుల్‌లో లాస్ట్ ప్లేస్‌లో ఉంది. వరుస పరాజయాలతో ఆరెంజ్ ఆర్మీ డీలాపడింది. అయితే దీనికి కెప్టెన్ కమిన్స్ రాంగ్ డెసిషన్సే కారణమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస పరాజయాలతో అటు ఆటగాళ్లతో పాటు ఇటు అభిమానులూ డీలాపడ్డారు. సండే ఫైట్‌లో గుజరాత్ టైటాన్స్ మీద నెగ్గి కమ్‌బ్యాక్ ఇస్తారని అంతా హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఆశలు అడియాశలు అయ్యాయి. జీటీ మీద 7 వికెట్ల తేడాతో ఓడి ప్లేఆఫ్స్ రేసుల్ని మరింత క్లిష్టతరం చేసుకుంది ఆరెంజ్ ఆర్మీ. వరుస ఓటములతో టీమ్‌లో చాలా సమస్యలు బయటపడ్డాయి. అయితే జట్టు పరిస్థితికి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తప్పుడు నిర్ణయాలే ప్రధాన కారణమనే విమర్శలు వస్తున్నాయి. మరి.. ఏంటా డెసిషన్స్.. అనేది ఇప్పుడు చూద్దాం..
బౌలింగ్ చేంజెస్
సరైన సమయానికి బౌలింగ్ చేంజెస్ చేయడంలో కమిన్స్ తడబడుతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్నటి మ్యాచ్‌లో 2 వికెట్లు పడ్డాక జీటీ మీద ప్రెజర్ పెంచేందుకు ఉనద్కట్‌ను వాడుకుంటే బాగుండేది. కానీ తరచూ రన్స్ లీక్ చేస్తున్న సిమర్జీత్‌తో బౌలింగ్ వేయించాడు కమిన్స్. అతడు ఒకే ఓవర్‌లో ఏకంగా 20 రన్స్ ఇచ్చేశాడు. 152 లాంటి స్మాల్ టార్గెట్స్ ఉన్నప్పుడు ఒక్క బ్యాడ్ ఓవర్ మ్యాచ్‌ను మార్చేస్తుంది. నిన్న ఎగ్జాక్ట్‌గా అదే జరిగింది. కేకేఆర్‌తో మ్యాచ్‌లో పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తున్నా స్పిన్నర్లతో ఎక్కువ ఓవర్లు వేయించలేదు. కమిందు మెండిస్‌కు ఒకే ఓవర్ ఇచ్చాడు కమిన్స్. అతడు ఆ ఓవర్‌లో 4 రన్స్ ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. అన్సారీతో ఫుల్ కోటా వేయించలేదు. పైగా వికెట్ స్పిన్‌కు అనుకూలించలేదన్నాడు కమిన్స్. అటు చూస్తే.. ప్రత్యర్థి టీమ్‌లో వరుణ్-నరైన్ కలసి 8 ఓవర్లు వేసి 4 వికెట్లు తీశారు. దీన్ని బట్టి బౌలింగ్ చేంజెస్, రిసోర్స్ యూటిలైజేషన్, పిచ్‌ను అంచనా వేయడంలో ఎస్‌ఆర్‌హెచ్ సారథి ఎంతగా తడబడ్డాడో అర్థం చేసుకోవచ్చు.
స్పిన్ సెలెక్షన్
గత రెండు మ్యాచుల్లో పిచ్ నుంచి స్పిన్‌కు మద్దతు లభించినా కమిన్స్ దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. స్పిన్నర్ల కంటే టీమ్‌లో పేసర్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, జంపా లాంటోడ్ని బెంచ్‌పై కూర్చోబెట్టడం టీమ్‌కు మైనస్‌గా మారింది. జట్టులో ఉన్న మెండిస్, అన్సారీతో పూర్తి ఓవర్లు వేయించకపోవడం కూడా రివర్స్ అవుతోంది.
ఫీల్డింగ్ లోపాలు
ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఫీల్డింగ్‌లో దారుణంగా విఫలమవుతోంది. ఫీల్డర్లు వరుసబెట్టి క్యాచులు మిస్ చేస్తున్నారు. గ్రౌండ్ ఫీల్డింగ్‌లోనూ రన్స్ లీక్ అవుతున్నాయి. అయితే కెప్టెన్-టీమ్ మేనేజ్‌మెంట్ ఏం చేస్తోందో ఎవరికీ అర్థం కావడం లేదు.
వ్యూహరచన
అపోజిషన్ టీమ్‌లోని బ్యాటర్లకు తగ్గట్లు సన్‌రైజర్స్ నుంచి వ్యూహాలు కనిపించడం లేదు. సేమ్ టైమ్ ఫస్ట్ బ్యాటింగ్ లేదా చేజింగ్.. ఎప్పుడు ఎలా ఆడాలో సరైన ప్లానింగ్ లేకుండానే వచ్చి బ్యాటర్లు ఊపేసి ఔట్ అవడం కన్‌ఫ్యూజన్‌గా మారింది. టీమ్ స్ట్రాటజీ యూనిట్ పనితీరు మీద ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బ్యాటింగ్ మిస్టేక్స్
హెడ్, అభిషేక్, ఇషాన్, నితీష్.. ఇలా టాప్-4లో ఎవరూ నిలకడగా పరుగులు చేయడం లేదు. అయినా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎలాంటి మార్పులు చేయడం లేదు ఎస్‌ఆర్‌హెచ్. అందుబాటులో ఉన్న ఇతర ఆప్షన్స్‌ను కమిన్స్ ఎందుకు పరిశీలించడం లేదు అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
పిచ్ స్ట్రాటజీ
పిచ్‌కు తగ్గట్లు ప్లేయింగ్ 11లో మార్పులు చేసుకోవడం, స్ట్రాటజీలు చేంజ్ చేసుకోవడం కామన్. కానీ ఫ్లాట్ వికెట్ వచ్చినా బ్లాక్ సాయిల్ పిచ్ వచ్చినా ఒకేలా దూకుడుగా ఆడాలనే సన్‌రైజర్స్ ఫార్ములా ఎవరికీ అంతుపట్టడం లేదు. ఈ అప్రోచ్‌తో వరుస వైఫల్యాలు పలకరిస్తున్నా కెప్టెన్ కమిన్స్, కోచ్ వెటోరి వెనక్కి తగ్గడం లేదు. ఈ మిస్టేక్స్ జట్టుకు ఇంకెంత కాస్ట్‌లీగా మారతాయోననే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఇవీ చదవండి:
పంత్‌పై ప్రేమ చంపుకోని హీరోయిన్
ఎస్‌ఆర్‌హెచ్ ఓటమికి హెచ్‌సీఏ కారణమా..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి