Share News

Rohit Sharma: పాత రోహిత్ జస్ట్ వచ్చి వెళ్లాడు.. ఇంకాసేపు ఉంటే మరణ మృదంగమే

ABN , Publish Date - Jan 24 , 2025 | 01:15 PM

Ranji Trophy 2025: ఫామ్ అందుకోవడం కోసం తీవ్రంగా చెమటోడ్చుతున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అందుకోసం దాదాపు దశాబ్ద కాలం తర్వాత రంజీ ట్రోఫీ బరిలోకి అడుగు పెట్టాడు.

Rohit Sharma: పాత రోహిత్ జస్ట్ వచ్చి వెళ్లాడు.. ఇంకాసేపు ఉంటే మరణ మృదంగమే
Rohit Sharma

‘ఫామ్ టెంపరరీ.. క్లాస్ పర్మినెంట్’ అనే నానుడి క్రికెట్‌లో బాగా వినిపిస్తూ ఉంటుంది. ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడం, తిరిగి అందుకోవడం అనేది జెంటిల్మన్ గేమ్‌లో సామాన్యమైన విషయమే. అయితే కొందరు ప్లేయర్లు తిరిగి టచ్‌లోకి వచ్చేందుకు చాలా కాలం తీసుకుంటారు. ఎంత ప్రాక్టీస్ చేసినా అదృష్టం కలసిరాకపోవడం, ఆత్మ విశ్వాసం లోపించడం లాంటి కారణాల వల్ల మునుపటి రేంజ్‌లో ఆకట్టుకోలేకపోతారు. అలాంటి టైమ్‌లో వాళ్ల టాలెంట్‌పై భరోసా ఉంచి ఆడిస్తుంటాయి టీమ్ మేనేజ్‌మెంట్స్. దీని వల్ల తక్కువ సమయంలోనే తిరిగి ఫామ్‌ను అందుకుంటుంటారు ఆటగాళ్లు. ఇప్పుడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇదే విధంగా రిథమ్‌ను అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాజాగా రంజీ ట్రోఫీలో వరుస సిక్సులతో అదరగొట్టాడతను.


అటాక్.. అటాక్.. అటాక్!

ఫామ్‌లోకి వచ్చేందుకు రంజీ బాట పట్టిన రోహిత్.. జమ్మూ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. 19 బంతుల్లో 3 పరుగులే చేసి అభిమానులను నిరాశకు గురిచేశాడు. దీంతో ఇక అతడి పనైపోయిందని, రెడ్ బాల్ క్రికెట్‌ నుంచి అతడు సన్యాసం తీసుకుంటే బెటర్ అనే విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో అదే మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో రోహిత్ చెలరేగిపోయాడు. క్రీజులో ఉన్నంత సేపు భారీ షాట్లతో అలరించాడు. అటాకింగ్ మంత్రంతో బ్యాట్‌ను ఝళిపించాడు. ఒకే ఓవర్‌లో బిగ్ సిక్స్‌తో పాటు మరో 2 బౌండరీలు బాదాడు హిట్‌మ్యాన్.


పాత రోహిత్‌ను గుర్తుచేశాడు!

యుద్ధ్‌వీర్ ఓవర్‌లో ఇంకో భారీ సిక్స్ కొట్టాడు రోహిత్. మరుసటి ఓవర్‌లో మరో సిక్స్ బాదాడు. మొత్తంగా 28 బంతులు ఆడిన హిట్‌మ్యాన్ 2 బౌండరీలు, 3 భారీ సిక్సుల సాయంతో 35 పరుగులు చేశాడు. స్ట్రయిట్ వికెట్ మీదుగా బౌలర్ తలపై నుంచి అతడు బాదిన సిక్స్ ఇన్నింగ్స్‌కు హైలైట్‌గా నిలిచింది. అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో తనను ఔట్ చేసిన ఉమర్ బౌలింగ్‌లో తన ఫేవరెట్ పుల్ షాట్‌తో ఆకట్టుకున్నాడు రోహిత్. భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా బిగ్ షాట్స్‌తో కాసేపు పాత హిట్‌మ్యాన్ అలా వచ్చి వెళ్లాడు. అతడు గనుక మరో ఆరేడు ఓవర్లు ఆడి ఉంటే ఈజీగా ఇంకో 30 నుంచి 40 పరుగులు వచ్చేవి. పూర్తి ఫామ్‌ను అందుకోకపోయినా ఉన్న కొద్దిసేపు మెరుపులు మెరిపించాడు భారత సారథి. అతడు ఇదే రీతిలో ఆడుతూ ఫుల్ టచ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.


ఇవీ చదవండి:

14,505 బంతులతో ఎంసీఏ గిన్నిస్‌ రికార్డు

‘చాంపియన్స్‌ ట్రోఫీ’కి భారీ భద్రత

అర్జున్‌ను వెనక్కి నెట్టిన గుకేష్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 24 , 2025 | 01:21 PM