Rohit Sharma: మనసు మార్చుకున్న రోహిత్.. ఒక్కసారిగా ప్లాన్ చేంజ్
ABN , Publish Date - Mar 15 , 2025 | 04:10 PM
IPL 2025: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హఠాత్తుగా యూ-టర్న్ తీసుకున్నాడని తెలుస్తోంది. సారథ్యం విషయంలో అతడు మనసు మార్చుకున్నాడని సమాచారం. అసలు ఏం జరుగుతోంది అనేది ఇప్పుడు చూద్దాం..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ యూ-టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సారథ్యం విషయంలో అతడు వెనక్కి తగ్గాడని వినిపిస్తోంది. ఇప్పటికే టీ20లకు గుడ్‌బై చెప్పిన హిట్‌మ్యాన్.. వన్డేలు, టెస్టుల్లో కొనసాగుతున్నాడు. ఇటీవలే 50 ఓవర్ల ఫార్మాట్‌లో చాంపియన్స్ ట్రోఫీని టీమిండియాకు అందించిన రోహిత్.. ఈ ఫార్మాట్‌లో మరో రెండేళ్ల పాటు ఆడాలని అనుకుంటున్నాడట. వన్డే వరల్డ్ కప్-2027లో ఆడాలని భావిస్తున్నాడట. అయితే టెస్ట్ సారథ్యంలో విషయంలో ముందు తీసుకున్న నిర్ణయాన్ని అతడు వెనక్కి తీసుకున్నాడని వినిపిస్తోంది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మనసు మారింది
లాంగ్ ఫార్మాట్‌లో వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడిన రోహిత్.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆఖరి టెస్ట్ నుంచి తప్పుకున్నాడు. దీంతో భవిష్యత్తులో టెస్టుల్లో ఆడినా.. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటాడనే పుకార్లు వినిపించాయి. బీసీసీఐ పెద్దలు కూడా జస్‌ప్రీత్ బుమ్రాను కెప్టెన్ చేసి.. హిట్‌మ్యాన్‌ను బ్యాటర్‌గా కంటిన్యూ చేయాలని భావిస్తున్నట్లు గాసిప్స్ వచ్చాయి. అయితే ఒక్క సక్సెస్‌తో అంతా మారిపోయిందని తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ-2025లో విజేతగా నిలవడంతో రోహిత్ మనసు మార్చుకున్నాడని సమాచారం.
సక్సెస్ ఇచ్చిన కిక్‌తో..
టెస్టుల్లోనూ టీమిండియాను లీడ్ చేయాలని అనుకుంటున్నాడట రోహిత్. కెప్టెన్ పోస్ట్‌లో మరికొన్నాళ్లు కంటిన్యూ అవ్వాలని భావిస్తున్నాడట. చాంపియన్స్ ట్రోఫీలో అతడు జట్టును నడిపిన తీరు, బ్యాటింగ్‌లో చెలరేగిన విధానం చూసి సెలెక్షన్ కమిటీ, బీసీసీఐ పెద్దలు కూడా టెస్ట్ కెప్టెన్‌గా అతడ్ని కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారట. చాంపియన్స్ ట్రోఫీ గెలుపు లేకపోతే రోహిత్ యూ-టర్న్ తీసుకునేవాడు కాదని తెలుస్తోంది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై విక్టరీ ఇచ్చిన కిక్.. లాంగ్ ఫార్మాట్‌లోనూ అగ్రెసివ్‌గా ముందుకెళ్లాలనే ఆలోచన అతడిలో కలిగేలా చేసిందని సమాచారం. ఒక్క విజయం రోహిత్‌లో ఎనలేని స్ఫూర్తి, నమ్మకాన్ని నింపిందని వినిపిస్తోంది. ఇకపోతే, ఐపీఎల్-2025లోనూ దుమ్మురేపాలని చూస్తున్నాడు హిట్‌మ్యాన్. చాంపియన్స్ ట్రోఫీ ఫామ్‌నే క్యాష్ రిచ్ లీగ్‌లోనూ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాడు. అతడు క్లిక్ అయితే ముంబై ఇండియన్స్‌కు ఢోకా ఉండదనే చెప్పాలి.
ఇవీ చదవండి:
కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన అయ్యర్
సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ న్యూస్
బుమ్రాపై ఆసీస్ లెజెండ్ సీరియస్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి