Share News

IND vs NZ: కివీస్‌తో మ్యాచ్‌కు రోహిత్ దూరం.. టెన్షన్ వద్దు.. రీజన్ వేరే ఉంది

ABN , Publish Date - Feb 28 , 2025 | 02:42 PM

Rohit Sharma: సారథి రోహిత్ శర్మ లేకుండానే చాంపియన్స్ ట్రోఫీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది భారత్. అసలు కివీస్‌తో పోరుకు హిట్‌మ్యాన్ ఎందుకు దూరం అవుతున్నాడు? అతడ్ని ఎవరు రీప్లేస్ చేయనున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం..

IND vs NZ: కివీస్‌తో మ్యాచ్‌కు రోహిత్ దూరం.. టెన్షన్ వద్దు.. రీజన్ వేరే ఉంది
Champions Trophy 2025

చాంపియన్స్ ట్రోఫీలో బుల్లెట్ పేస్‌తో దూసుకెళ్తోంది టీమిండియా. ఎదురొచ్చిన ప్రత్యర్థిని బుల్డోజర్‌లా తొక్కుకుంటూ వెళ్తోంది. కప్పు కొట్టడమే ధ్యేయంగా తగ్గేదేలే అంటోంది భారత్. రప్పా రప్పా అంటూ అపోజిషన్ టీమ్స్‌ను ఓ పట్టు పడుతోంది. తొలుత బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన రోహిత్ సేన.. మలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. చివరి లీగ్ మ్యాచ్‌కు సిద్ధమవుతోంది మెన్ ఇన్ బ్లూ. సెమీఫైనల్స్‌కు ముందు జరిగే ఈ మ్యాచ్‌లో సారథి రోహిత్ శర్మ ఆడటం లేదని తెలుస్తోంది. అసలు హిట్‌మ్యాన్ ఎందుకు బరిలోకి దిగడం లేదు? అతడి స్థానంలో ఎవర్ని ఆడిస్తారు? అనేది ఇప్పుడు చూద్దాం..


రీప్లేస్‌మెంట్ ఎవరు..

తొడ కండరాల నొప్పితో బాధపడుతున్న రోహిత్ శర్మ న్యూజిలాండ్‌తో పోరులో రెస్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం టీమ్ మొత్తం ప్రాక్టీస్ చేయగా.. రోహిత్ మాత్రం నెట్స్‌కు రాలేదు. ఫిజియోథెరపిస్ట్, స్ట్రెంగ్త్ అండ్ కండీషనింగ్ కోచ్‌తో కలసి కనిపించాడు. మున్ముందు సెమీస్, ఫైనల్స్ లాంటి కీలక మ్యాచులు ఉన్న నేపథ్యంలో విశ్రాంతి తీసుకోవాలని హిట్‌మ్యాన్ భావిస్తున్నాడట. అతడికి రెస్ట్ ఇస్తే తిరిగి డబుల్ ఎనర్జీతో గ్రౌండ్‌లోకి అడుగు పెడతాడని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోందని తెలిసింది. రోహిత్ స్థానంలో పించ్ హిట్టర్ రిషబ్ పంత్‌ను రీప్లేస్ చేస్తారని సమాచారం. పంత్‌ను కాదనుకుంటే స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను కూడా ఆడించే అవకాశాలు ఉన్నట్లు వినిపిస్తోంది.


గెలవాల్సిందే..

సండే ఫైట్‌లో కివీస్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు రెడీ అవుతోంది భారత్. ఆల్రెడీ సెమీస్‌కు క్వాలిఫై అయినందున ఈ మ్యాచ్‌ రిజల్ట్‌తో రెండు జట్లకు పెద్దగా ఒరిగేదేమీ లేదు. కానీ నాకౌట్ ఫైట్‌కు మరింత ఆత్మవిశ్వాసంతో వెళ్లడం, జట్టులోని బలహీనతలను అధిగమించడం, టీమ్ కాంబినేషన్‌పై మరింత క్లారిటీ కోసం ఈ మ్యాచ్‌ను వినియోగించుకోవాలని చూస్తున్నాయి భారత్-కివీస్. గెలిస్తే మరింత ఉత్సాహంతో సెమీస్‌లో ఆడొచ్చు కాబట్టి రెండు టీమ్స్ విజయం కోసం ప్రయత్నిస్తాయి. ఒకవేళ రోహిత్ ఆడకపోతే వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సారథిగా జట్టును ముందుండి నడిపిస్తాడు.


ఇవీ చదవండి:

గార్డ్‌నర్‌ ధనాధన్‌

ఎవరిదో సెమీస్‌ బెర్త్‌?

‘వన్‌ లాస్ట్‌ టైమ్‌’ !

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 28 , 2025 | 02:47 PM