Share News

SRH vs DC IPL 2025: సన్‌రైజర్స్‌కు జిడ్డులా తగులుకున్నాడు.. ఇప్పట్లో వదిలేలా లేడు

ABN , Publish Date - Mar 30 , 2025 | 07:53 PM

Indian Premier League: సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది కమిన్స్ సేన. అయితే ఎస్‌‌ఆర్‌హెచ్ ఓటమిని కేవలం ఒకే ఒక ప్లేయర్ శాసించాడు. అతడు ఎవరంటే..

SRH vs DC IPL 2025: సన్‌రైజర్స్‌కు జిడ్డులా తగులుకున్నాడు.. ఇప్పట్లో వదిలేలా లేడు
SRH vs DC

మిచెల్ స్టార్క్.. ఈ పేరు వింటేనే సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు భయపడుతున్నారు. దీనికి కారణం అతడు ఎస్‌ఆర్‌హెచ్‌కు పీడకలలు పరిచయం చేయడమే. విశాఖపట్నం వేదికగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ ఓటమికి అతడే ప్రధాన కారణం. ఈ మ్యాచ్‌లో ఏకంగా 5 వికెట్లు తీసి కమిన్స్ సేన ఓటమిని శాసించాడు స్టార్క్. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి ఇలా ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ వెన్నెముకను అతడు విరిచేశాడు. అయితే స్టార్క్ ఇప్పుడే కాదు.. లాస్ట్ ఐపీఎల్ నుంచే మనకు జిడ్డులా తగులుకున్నాడు.


ఆ షాక్ మర్చిపోక ముందే..

గత సీజన్‌లో సన్‌రైజర్స్ మాస్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను భయపెట్టింది. నీళ్లు తాగినంత అలవోకగా 250 ప్లస్ స్కోర్లు బాదుతూ టీ20 క్రికెట్‌కు కొత్త డెఫినిషన్ ఇచ్చింది. అదే ఊపులో ప్లేఆఫ్స్‌‌కు దూసుకొచ్చింది. అప్పుడు మొదలైంది ఎస్‌ఆర్‌హెచ్-స్టార్క్ కొట్లాట. ప్లేఆఫ్స్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లతో ఆడుకున్నాడీ స్పీడ్‌స్టర్. ట్రావిస్ హెడ్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్‌ను ఔట్ చేశాడు. అక్కడితో ఆగలేదు. ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠీని వెనక్కి పంపించి.. మనకు కప్పు రాకుండా అడ్డుకున్నాడు. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగి ఆరంభంలోనే చకచకా 3 వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బ కొట్టాడు. దీంతో ఈ స్టార్క్ జిడ్డులా తగులుకున్నాడేంటని నెటిజన్స్ అంటున్నారు. ఆరెంజ్ ఆర్మీపై అతడికి అంత పగ ఎందుకో.. కసిగా బౌలింగ్ చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

ట్రెండ్ మార్చిన సీఎస్‌కే.. ఇద్దరు ఔట్

నితీష్ రెడ్డికి సరికొత్త చాలెంజ్

ఐపీఎల్ ఓనర్లలో మోస్ట్ రిచ్ ఎవరంటే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 30 , 2025 | 07:53 PM