Mohammed Siraj: రివేంజ్ తీర్చుకున్న సిరాజ్.. ఇది ఐపీఎల్‌కు మించిన రైవల్రీ
ABN , Publish Date - Apr 06 , 2025 | 08:45 PM
IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ సీమర్ మహ్మద్ సిరాజ్ చెలరేగిపోతున్నాడు. వరుస వికెట్లు తీస్తూ ఆరెంజ్ ఆర్మీ క్యాంప్‌లో కలవరం రేపుతున్నాడు మియా. పనిలో పనిగా ప్రతీకారం కూాడా తీర్చుకున్నాడు.

క్రికెట్‌లో రైవల్రీలకు కొదువ లేదు. కొన్ని పోరాటాలు మాత్రం బాగా హైలైట్ అవుతుంటాయి. అలాంటిదే మహ్మద్ సిరాజ్-ట్రావిస్ హెడ్ రైవల్రీ. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఈ ఇద్దరూ తలపడిన ప్రతిసారి ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. అయితే మియాను హెడ్ బాదేయడం లేదా కంగారూ స్టార్‌ను సిరాజ్ పెవిలియన్‌కు పంపించడమో జరుగుతూ ఉంటుంది. అలాగే ఎదురుపడినప్పుడు తిట్ల పురాణం అందుకోవడం, పైపైకి దూసుకెళ్లడం కూడా చూస్తూనే ఉంటాం. వీళ్ల రైవల్రీ ఐపీఎల్ తాజా ఎడిషన్‌లోనూ కంటిన్యూ అవుతోంది. అయితే ఈసారి సిరాజ్ దాదాగిరి చూపించాడు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
ఫస్ట్ ఓవర్‌లోనే..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ దూకుడుగా బౌలింగ్ చేస్తున్నాడు. ఫస్ట్ ఓవర్ లాస్ట్ బంతికి ట్రావిస్ హెడ్ (9)ను ఔట్ చేశాడు సిరాజ్. 2 బౌండరీలు కొట్టిన స్టార్ బ్యాటర్.. మియాపై పైచేయి సాధించినట్లే కనిపించాడు. కానీ మంచి బంతితో అతడి పనిపట్టాడు సిరాజ్. ఆ తర్వాత వరుస బౌండరీలతో దూకుడు మీద ఉన్న అభిషేక్ శర్మ (18)ను వెనక్కి పంపించాడు. ఇలా ఆదిలోనే ఆరెంజ్ ఆర్మీ జోరుకు బ్రేకులు వేశాడు. ముఖ్యంగా హెడ్‌ను పంపడం ఎస్‌ఆర్‌హెచ్‌కు బిగ్ మైనస్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్.. హెడ్ మీద మియా పగ తీర్చుకున్నాడని, ఇది ఐపీఎల్‌కు మించిన రైవల్రీ అని కామెంట్స్ చేస్తున్నారు. లోకల్ బాయ్ క్వాలిటీ పేస్, పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌తో అదరగొడుతున్నాడని మెచ్చుకుంటున్నారు.
ఇవీ చదవండి:
వేలంలో రూ.18 కోట్లు.. చాహల్ ఏమన్నాడంటే..
నేను ఆడాలా, వద్దా డిసైడ్ చేసేది అదే: ధోనీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి