Virat Kohli-Shubman Gill: కోహ్లీ వర్సెస్ గిల్.. ఐపీఎల్‌లో కొత్త కొట్లాట
ABN , Publish Date - Apr 03 , 2025 | 04:47 PM
IPL 2025: టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్ అభిమానుల మధ్య ఇప్పుడు కొట్లాట జరుగుతోంది. ఐపీఎల్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఈ కొత్త రచ్చ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

ఫ్యాన్ వార్స్.. సోషల్ మీడియాలో తరచుగా ఇవి చూస్తూనే ఉంటాం. ఫిల్మ్ సెలెబ్రిటీస్, క్రికెట్ స్టార్స్ అభిమానులు నెట్టింట కొట్టుకోవడం కామనే. ఇప్పుడు అలాంటి ఓ ఫైటే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను హీటెక్కిస్తోంది. టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్ మధ్య జరిగిన ఓ ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్‌కు కారణమైంది. అసలు వీళ్ల మధ్య ఏం జరిగింది.. నెట్టింట అభిమానులు ఎందుకు కొట్టుకుంటున్నారు.. అనేది ఇప్పుడు చూద్దాం..
ఒక్క పోస్ట్‌తో..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-గుజరాత్ టైటాన్స్ మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా నిన్న మ్యాచ్ జరిగింది. ఇందులో జీటీ ఘన విజయం సాధించింది. అయితే గుజరాత్ ఇన్నింగ్స్ సమయంలో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో గిల్ ఔట్ అయ్యాడు. టీమ్‌కు కెప్టెన్ కావడం, బ్యాటింగ్ యూనిట్‌కు వెన్నెముక లాంటి ప్లేయర్ ఔట్ అవడంతో కోహ్లీ సంతోషంలో మునిగిపోయాడు. అరుస్తూ అగ్రెసివ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. మ్యాచ్ కావడంతో అగ్రెషన్ చూపించినా ఆ తర్వాత ఇద్దరూ ఒకర్నొకరు హగ్ చేసుకున్నారు. దీంతో అంతా ఓకే అని అనుకున్నారు. కానీ మ్యాచ్ అయ్యాక గిల్ పెట్టిన పోస్ట్ ప్రకంపనలు రేపుతోంది. ఆట మీదే దృష్టి పెట్టాలి.. అనవసర విషయాలపై కాదు అంటూ శుబ్‌మన్ పెట్టిన పోస్ట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు చిర్రెత్తుకొచ్చేలా చేసింది.
బడితపూజ ఖాయం
కోహ్లీని ఉద్దేశించే గిల్ ఈ పోస్ట్ పెట్టాడని విరాట్ ఫ్యాన్స్ అంటున్నారు. ఆట మీదే ఫోకస్ పెట్టడం అంటే ఇదేనా అంటూ.. శుబ్‌మన్ క్లీన్‌బౌల్డ్ అయిన వీడియోలు షేర్ చేస్తున్నారు. విరాట్‌నే అంటావా.. ఎంత ధైర్యం అంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు. నెక్స్ట్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ఉంటుంది మావా.. ఒక రేంజ్‌లో కింగ్ నుంచి బడితపూజ ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. రియల్ ఫోకస్ అంటే ఎలా ఉంటుందో విరాట్ మీకు చూపిస్తాడని అంటున్నారు.
ఇవీ చదవండి:
ప్లేయింగ్ 11తోనే భయపెడుతున్నారు
సన్‌రైజర్స్ గెలుపు దాహం తీరేనా..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి