Share News

IPL 2025, PBKS vs LSG: టాస్ గెలిచిన పంజాబ్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే

ABN , Publish Date - Apr 01 , 2025 | 07:08 PM

హార్డ్ హిట్టర్లతో నిండిన రెండు బలమైన జట్లు అమీతుమీకి సిద్ధమవుతున్నాయి. లఖ్‌నవూ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ లెవెన్, రిషభ్ పంత్ సారథ్యంలోని లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాయి.

IPL 2025, PBKS vs LSG: టాస్ గెలిచిన పంజాబ్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే
PBKS vs LSG

ఐపీఎల్‌ (IPL 2025)లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. హార్డ్ హిట్టర్లతో నిండిన రెండు బలమైన జట్లు అమీతుమీకి సిద్ధమవుతున్నాయి. లఖ్‌నవూ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ లెవెన్, రిషభ్ పంత్ సారథ్యంలోని లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాయి.


టాస్ గెలిచిన పంజాబ్ టీమ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో లఖ్‌నవూ టీమ్ మొదట బ్యాటింగ్‌కు దిగబోతోంది. ఇరు జట్లలోని బ్యాటర్లు సూపర్ ఫామ్‌లో ఉండటం, బౌలింగ్ యూనిట్ కూడా సమష్టిగా రాణిస్తుండటంతో నేటి మ్యాచ్ చివరి వరకు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. నువ్వా నేనా అంటూ ఇరు టీమ్స్ ఢీ అంటే ఢీ అంటున్నాయి.


తుది జట్లు:

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, మార్‌క్రమ్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్, బదోనీ, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేశ్ సింగ్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్

పంజాబ్ కింగ్స్: ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, సూర్యవంశ్, మార్కో జాన్సన్, చాహల్, ల్యూకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 01 , 2025 | 07:21 PM