ఆరో టైటిల్ వేటలో..’
ABN , Publish Date - Mar 17 , 2025 | 01:37 AM
గతేడాది కెప్టెన్సీ మార్పు.. పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి అసలుసిసలు సత్తా చాటాలనుకొంటోంది. ఐదుసార్లు మెగా లీగ్ విజేతగా నిలిచిన ముంబై.. రికార్డుస్థాయిలో ఆరో టైటిల్‌పై...

ఐపీఎల్ మరో 5 రోజుల్లో
పునర్వైభవం కోసం ముంబై..
పాండ్యా కెప్టెన్సీకి పరీక్ష
గతేడాది కెప్టెన్సీ మార్పు.. పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి అసలుసిసలు సత్తా చాటాలనుకొంటోంది. ఐదుసార్లు మెగా లీగ్ విజేతగా నిలిచిన ముంబై.. రికార్డుస్థాయిలో ఆరో టైటిల్‌పై గురిపెట్టింది. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను సారథిగా ప్రకటించడంతో అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మైదానంలో పాండ్యాకు అవహేళనలు కూడా ఎదురయ్యాయి. అయితే, ఆ తర్వాత జరిగిన టీ20 వరల్డ్‌క్‌పలో భారత్‌ను విజేతగా నిలపడంలో హార్దిక్ కీలకపాత్ర పోషించాడు. తాజాగా చాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆకట్టుకోవడంతో.. ఈసారి ఫ్యాన్స్ అండగా నిలుస్తారని భావిస్తున్నారు. గత సీజన్ చివరి మ్యాచ్‌లో స్లోఓవర్ రేట్ కారణంగా పాండ్యాపై ఒక మ్యాచ్ వేటుపడింది. దీంతో ఈ 18వ అంచెలో తొలి మ్యాచ్‌కు అతడు దూరం కానుండడంతో.. తాత్కాలికంగా రోహిత్ జట్టును నడిపించే అవకాశం ఉంది. మెగా వేలం తర్వాత జరుగుతున్న లీగ్ కావడంతో జట్టు కుదురుకోవడానికి కొంత సమయం పట్టనుంది. వెన్నునొప్పితో బాధపడుతున్న స్టార్ పేసర్ బుమ్రా ఆలస్యంగా బరిలోకి దిగే చాన్సులున్నాయి. రోహిత్, హార్దిక్, బుమ్రా, సూర్యకుమార్, తిలక్ వర్మ కోర్ టీమ్. బ్యాటర్లు ర్యాన్ రికెల్టన్ (దక్షిణాఫ్రికా), రాబిన్ మిన్జ్ ఈసారి ప్రత్యేక ఆకర్షణ. ట్రెంట్ బౌల్ట్, శాంట్నర్, రీస్ టోప్లే, విల్ జాక్స్, బెవాన్ జాకబ్స్‌తో టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో జట్టు ఎంతో బలంగా ఉంది. తరచూ గాయపడే దీపక్ చాహర్ పేస్ భారాన్ని ఏమేరకు మోస్తాడో చూడాలి. ఏడు, ఎనిమిది స్థానాల్లో సరైన ఫినిషర్ లేని లోటు కనిపిస్తోంది.
ముంబై జట్టు
బ్యాటర్లు: రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, బెవాన్ జాకబ్స్, రాబిన్ మిన్జ్, నమన్ ధిర్, రికెల్టన్, కృష్ణన్ శ్రీజిత్
ఆల్ రౌండర్లు: హార్దిక్ పాండ్యా, రాజ్ బవా, కోర్బిన్ బాష్, విల్ జాక్స్, శాంట్నర్, తిలక్ వర్మ
బౌలర్లు: జస్‌ప్రీత్ బుమ్రా, అశ్విన్ కుమార్, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజిబుర్ రహ్మాన్, విఘ్నేష్ పుతుర్, సత్యనారాయణ రాజు, కర్ణ్ శర్మ, అర్జున్ టెండూల్కర్, రీస్ టోప్లే.
ధోనీకి ఘనంగా గుడ్‌బై చెప్పాలి!
ఆల్‌రౌండర్ల అండతో సీఎ్‌సకే
ఐపీఎల్ చరిత్రలో అత్యంత నిలకడైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎ్‌సకే). ధోనీ చివరి లీగ్‌గా భావిస్తున్న నేపథ్యంలో యువతరం ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేలం తర్వాత జట్టులో భారీ మార్పులు రావడంతో.. కుదురుకోవడానికి కొంత సమయంపట్టే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఈసారి ఆల్‌రౌండర్లపైనే చెన్నై ఎక్కువగా ఆధాపడేలా కనిపిస్తోంది. మహీ టీమ్‌లో ఉంటే ఫ్యాన్స్‌కు ఉండే జోషే వేరు. అతడిపై భారం లేకుండా చూడాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఓవరాల్‌గా ముంబైతో సమంగా ఐదు టైటిళ్లు సాధించిన చెన్నై.. ఈసారి టైటిల్‌తో ధోనీకి ఘనంగా వీడ్కోలు పలకాలనుకొంటోంది. గత సీజన్‌లో ఐదో స్థానంలో నిలిచిన సీఎ్‌సకే ప్లేఆఫ్స్ బెర్త్‌ను త్రుటిలో చేజార్చుకొంది. కాగా, రుతురాజ్ గైక్వాడ్ బ్యాటర్‌గా ఆకట్టుకొంటున్నా.. కెప్టెన్‌గా ధోనీ స్థాయిని అందుకోలేక పోతున్నాడు. ధోనీ, జడేజా దూరమైతే ఇప్పుడిప్పుడే ఆలోటును భర్తీ చేయడం కష్టమే..! కాన్వే, రచిన్ రవీంద్ర, గైక్వాడ్, ధోనీతో జట్టు బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. అయితే, మ్యాచ్ విన్నరైన పేసర్ లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. అశ్విన్, శివం దూబే, రవీంద్ర జడేజా లాంటి ఆల్‌రౌండర్లతో మిడిలార్డర్ బలంగా ఉంది. పేస్ బౌలింగ్ విభాగంలో మహీష్ పతిరన, ఖలీల్ అహ్మద్, సామ్ కర్రాన్, నాథన్ ఎల్లీస్ జట్టులో ఉన్నారు.
చెన్నై జట్టు
బ్యాటర్లు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, ధోనీ, రాహుల్ త్రిపాఠి, వన్ష్ బెదీ, రషీద్
ఆల్ రౌండర్లు:
రవీంద్ర జడేజా, శివం దూబే, రవిచంద్రన్ అశ్విన్, రచిన్ రవీంద్ర, అన్షుల్ కాంబోజ్, సామ్ కర్రాన్, దీపక్ హుడా, జేమీ ఓవర్టన్, విజయ్ శంకర్, రామకృష్ణ ఘోష్. కమలేష్ నాగర్‌కోటి, ముకేష్ చౌదరి
బౌలర్లు:
పతిరన, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, గుర్‌జ్‌పనీత్ సింగ్, నాథన్ ఎల్లీస్, శ్రేయాస్ గోపాల్.
ఇవి కూడా చదవండి..
Virat Kohli On BCCI: తలతిక్క రూల్స్ అవసరమా.. బీసీసీఐపై కోహ్లీ సీరియస్
Australian Grand Prix 2025: ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో సంచలనం.. వరల్డ్ చాంపియన్‌కు షాక్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..