Elon Musk: గ్రోక్ హిందీ తిట్ల వివాదంపై ఎలాన్ మస్క్ రియాక్షన్.. నెటిజన్ల విమర్శలు
ABN , Publish Date - Mar 22 , 2025 | 03:51 PM
ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన AI చాట్‌బాట్, గ్రోక్ ప్రస్తుతం ఇండియాలో చర్చనీయాంశంగా మారింది. పలు ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు ఇచ్చి వార్తల్లో నిలిచిన క్రమంలోనే, మస్క్ రియాక్షన్ కూడా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

టెస్లా, స్పేస్‌ఎక్స్ కంపెనీల వ్యవస్థాపకుడు, ఎలాన్ మస్క్ తన ఏఐ (AI) చాట్‌బాట్ "గ్రోక్"కు సంబంధించి వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ AI చాలా మంది వినియోగదారులకు అవాస్తవిక, అర్థం కాని సమాధానాలు ఇచ్చింది. ప్రధానంగా హిందీ యాసతో సంబంధం ఉన్న వాటికి విరుద్ధంగా ప్రతిస్పందనలను అందించింది. ఇది భారత రాజకీయాలు, క్రికెట్, బాలీవుడ్ సహా మరికొన్ని అంశాల విషయంలో వినూత్నంగా జవాబులు చెప్పింది. ఆ క్రమంలో ఈ చాట్‌బాట్ రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖ నాయకుల గురించి కూడా సంబంధం లేని విధంగా జవాబులు ఇచ్చింది.
రాజకీయాల్లో మాత్రం..
ఈ క్రమంలో గ్రోక్ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి మోదీ కంటే "నిజాయితీ" గల వ్యక్తిగా అభివర్ణించింది. ఈ సమాధానం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగటివ్ విమర్శలను ఎదుర్కొంది. దీంతోపాటు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సహా పలువురి విషయంలో కూడా గ్రోక్ తప్పుడు సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో గ్రోక్ పట్ల అనేక మంది సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఎలాన్ మస్క్ రియాక్షన్
ఇదే అంశంపై ఓ మీడియా కూడా కథనాన్ని పోస్ట్ చేయగా, దీనిపై ఎలాన్ మస్క్ వినూత్నంగా రియాక్ట్ అయ్యారు. తన సోషల్ మీడియా X ఖాతాలో మస్క్ ఓ నవ్వుతున్న ఎమోజీని యాడ్ చేసి స్పందించారు. కానీ ఎలాన్ మస్క్ ఈ వివాదంపై ప్రత్యక్షంగా స్పందించడం కన్నా, ఎమోజీని ఉపయోగించి ఇలా రియాక్ట్ కావడంపై అనేక మంది విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి విషయం మీకు హాస్యభరితంగా అనిపించిందా అని మస్క్‌ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ చర్య పట్ల ఎలాన్ మస్క్ ధోరణి సరిగా లేదని అంటున్నారు.
మస్క్ టీం
అంతేకాదు మరికొంత మంది మీరు భారతీయులపై పక్షపాతాన్ని చూపిస్తున్నారని కామెంట్లు చేశారు. ఇంకొంత మంది ఎలాన్ మస్క్ Xలో అధికంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని ప్రస్తావించారు. గ్రోక్ ఏఐ విడుదలకు ముందు ఎలాన్ మస్క్ ఈ మోడల్ అత్యంత తెలివైన ఏఐ అని ప్రస్తావించారు. ఈ వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ వివాదాలకు మస్క్ టీం చెక్ పెడుతుందా లేదా అనేది చూడాలి మరి.
ఇవి కూడా చదవండి:
WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Read More Business News and Latest Telugu News

బిగ్ డీల్..ఐఫోన్ 16పై 25 వేలకుపైగా తగ్గింపు ఆఫర్..

గ్రోక్ 3లో ఇమేజ్ ఎడిటింగ్ ఫీచర్ మామూలుగా లేదుగా..

ఆపిల్ సిరీస్ వాచ్‌లలో క్రేజీ ఫీచర్..కెమెరాలు అమర్చాలని..

ఇండియన్ రైల్వే నుంచి క్రేజీ యాప్..ఇకపై అన్నీ కూడా..

జీ మెయిల్ నుంచి కొత్త ఏఐ ఫీచర్..ఆ పనులు చేయడంలో
