Share News

Chandnagar: ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్‌ విద్యార్థి బలవన్మరణం!

ABN , Publish Date - Mar 01 , 2025 | 04:30 AM

ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Chandnagar: ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్‌ విద్యార్థి బలవన్మరణం!

  • ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య

చందానగర్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చందానగర్‌లో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నెహ్రునగర్‌లో రాజేశ్వరి కుటుంబం నివాసముంటోంది. శుక్రవారం డ్యూటీకి వెళ్లిన రాజేశ్వరి సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత గదిలోకి వెళ్లి చూడగా.. ఆమె కొడుకు దీక్షిత్‌రాజు (17) ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఆమె గట్టిగా అరవడంతో చుట్టు పక్కల వారు వచ్చి చూశారు. అప్పటికే బాలుడు మృతిచెందాడు. రాజేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Mar 01 , 2025 | 04:30 AM