Share News

మరణంలోనూ వీడని బంధం..

ABN , Publish Date - Apr 13 , 2025 | 10:47 PM

నిండు నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే ముగించింది ఆ ప్రేమ జంట. ఎన్నో కలలు..ఎన్నెన్నో ఆశలతో ఇంట్లో పద్ద వారిని కాదని ఒక్కటయ్యారు. పెద్ద వాళ్ల ఆశీస్సులు లేకున్నా ఆ దేవుడే తమకు దిక్కనుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

మరణంలోనూ వీడని బంధం..
ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమ జంట (ఫైల్‌)

ఆరు నెలల క్రితం ప్రేమ పెళ్లి..

15 రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత మరొకరు ఆత్మహత్య

కోటపల్లి, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి) : నిండు నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే ముగించింది ఆ ప్రేమ జంట. ఎన్నో కలలు..ఎన్నెన్నో ఆశలతో ఇంట్లో పద్ద వారిని కాదని ఒక్కటయ్యారు. పెద్ద వాళ్ల ఆశీస్సులు లేకున్నా ఆ దేవుడే తమకు దిక్కనుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. తామొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అన్నట్టు ఆ విధి రాతను తప్పించుకోలేకపోయారు. కనీసం మొదటి పెళ్లి రోజు వేడుక జరుపుకోకుండానే పెళ్లైన ఆరు నెలలకే 15 రోజుల వ్యవధిలో ఆ జంట తనువు చాలించింది. ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం మిగిల్చింది.

మండలంలోని దేవులవాడ గ్రామానికి చెందిన గాదె సృజన (20) మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని ఓ కళాశాలలో డిగ్రీ చివరి చదువుతోంది. అదే కళాశాలలో సీనియర్‌ అయిన విష్ణువర్దన్‌ అనే స్థానిక యువకుడితో సృజనకు స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్తా ప్రేమకు దారి తీసింది. కులాలు వేరు కా వడంతో తమ వివాహానికి ఇరు కుటుంబాల వారు అభ్యంతరం చెప్తారనే ఉద్దేశ్యంతో స్నేహితుల సహ కారంతో ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో సంబంధం లేకుం డా లక్షెట్టిపేటలోనే వేరు కాపురం పెట్టారు. ఎంతో అన్యోన్యంగా జీవనం సాగిస్తున్న దశలో ఏం జరిగిందో ఏమో కానీ విష్ణువర్ధన్‌ మార్చి నెల 24వ తేదీన రాయపట్నం గోదావరి బ్రిడ్జి వద్ద నుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో సృజన కుటుంబీకులు అక్కడకు వెళ్లి అంతిమ సంస్కా రాలు నిర్వహించిన అనంతరం సృజనను దేవులవాడలోని ఇంటికి తీసుకెళ్లారు. కానీ ప్రేమ పెళ్లి చేసుకో వడం అంతలోనే భర్త ఆత్మహత్యకు పాల్పడడంతో మానసికంగా కృంగిపోయిన సృజన భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. తాను కూడా ఆత్మహత్యకు పాల్పడితేనే తన భర్తకు నిజమైన ఆత్మశాంతి అని పలువురితో అభిప్రాయపడినట్లు సమాచారం. నిత్యం మానసిక వేదనకు గురవుతూనే కుటుంబ సభ్యు లకు ఎటువంటి అనుమానం రాకుండానే ప్రతి క్షణం గడిపింది. అవకాశం కోసం ఎదురు చూసిన సృజ న శనివారం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 15 రోజుల వ్యవధిలోనే ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడడంతో అటు విష్ణువర్ధన్‌ ఇంట్లోనూ, ఇటు సృజన ఇంట్లోను కుటుంబీకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Updated Date - Apr 13 , 2025 | 10:47 PM