Share News

Anganwadi Services: అంగన్వాడీలకు గుడ్ల సరఫరా టెండర్‌ గడువు మే 15 వరకు పెంపు

ABN , Publish Date - Apr 16 , 2025 | 04:39 AM

తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరా కోసం మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ఆహ్వానించిన టెండర్‌ గడువు మే 15 వరకూ పొడిగించింది. ఈ నిర్ణయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత టెండర్‌ దాఖలుకు అవకాశాలు పెరిగాయి.

 Anganwadi Services: అంగన్వాడీలకు గుడ్ల సరఫరా టెండర్‌ గడువు మే 15 వరకు పెంపు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరా కోసం మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ఆహ్వానించిన టెండర్‌ గడువు మే 15 వరకు పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఏడాది పాటు గుడ్ల సరఫరాకు గత నెల 30న టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. టెండర్ల దాఖలుకు తొలుత ఈ నెల 10 వరకూ.. తర్వాత 15 వరకూ పెంచింది. అగ్‌మార్క్‌ ధృవీకరణ పత్రంతోపాటు రెండేళ్ల అనుభవం గల అగ్‌మార్క్‌ సర్టిఫికెట్‌, రిప్లికా సీరియల్‌ నంబర్‌ ఉండాలని ప్రభుత్వం నిబంధన తెచ్చింది. దీంతో 23 మంది పౌలీ్ట్ర రైతుల్లో ఎనిమిది మందికి మాత్రమే టెండర్లు దాఖలుచేసే అవకాశం లభించింది. ఈ సమస్యను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తేవడంతో.. ఆయన ఆదేశాల మేరకు వచ్చేనెల 15 వరకూ మహిళా శిశు సంక్షేమశాఖ గడువు పొడిగించింది. టెండర్‌ దాఖలుచేసే నాటికి రెండేళ్ల అనుభవం గల అగ్‌మార్క్‌ సర్టిఫికెట్‌ ఉన్నా సరిపోతుందని నిబంధన సవరించినట్లు సమాచారం.



For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 16 , 2025 | 04:39 AM