BJP: నాయకుల వెన్నుపోటుతోనే బీజేపీ ఓటమి..
ABN , Publish Date - Jan 01 , 2025 | 09:02 AM
కొందరు నాయకుల వెన్నుపోట్లు కారణంగా కంటోన్మెంట్ నియోజకవర్గం(Cantonment constituency)లో బీజేపీ విజయం సాధించలేకపోతున్నదని, అటువంటి నాయకుల సమాచారం పార్టీపెద్దల వద్ద ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు బానుక మల్లికార్జున్ అన్నారు.
- పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు మల్లికార్జున్
సికింద్రాబాద్: కొందరు నాయకుల వెన్నుపోట్లు కారణంగా కంటోన్మెంట్ నియోజకవర్గం(Cantonment constituency)లో బీజేపీ విజయం సాధించలేకపోతున్నదని, అటువంటి నాయకుల సమాచారం పార్టీపెద్దల వద్ద ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు బానుక మల్లికార్జున్ అన్నారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు బానుక నర్మద, నాయకుడు బాణాల శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: జార్ఖండ్ నుంచి యువకులను తీసుకొచ్చి చోరీలు..
రెండుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ(BJP) అభ్యర్థి రెండోస్థానంలో నిలిచారని, అయితే లోకసభ ఎన్నికల్లో మాత్రం తమ పార్టీకి 25 వేల ఓట్ల అధిక్యత వచ్చిందన్నారు. కొందరు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీని పణంగా పెట్టారని, అందుకే కంటోన్మెంట్‌లో విజయం సాధించలేకపోతున్నామని చెప్పారు. తాను, తన సతీమణి నర్మద, బీజేపీ నాయకుల కృషి ఫలితంగా అన్ని ఎన్నికల్లో ఆరవ వార్డులో బీజేపీ(BJP)కి ఆధిక్యత వస్తుందన్నారు.
మూడు సంవత్సరాలుగా కంటోన్మెంట్ బోర్డ్డు ఎన్నికలు జరగటం లేదని, ఒకే నాయకుడికి నామినేటెడ్ పదవి ఇస్తున్నారని చెప్పారు. మరో ఆరు నెలల వరకు ఎన్నికలకు అవకాశం లేదని, అందుకే ఈసారి కూడా నామినేటెడ్ పదవి నియామకం చేపట్టే యోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు తెలిపారు. ఈ పర్యాయం కొత్తనాయకుడికి అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అందుకే తాను, తన సతీమణి నర్మద నామినేటెడ్ పదవికి దరఖాస్తు చేసుకున్నామన్నారు.
ఈవార్తను కూడా చదవండి: రైళ్ల వేళల్లో మార్పులు
ఈవార్తను కూడా చదవండి: కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్
ఈవార్తను కూడా చదవండి: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 24,905
ఈవార్తను కూడా చదవండి: సంక్షేమ ఫలాలు ప్రజల చెంతకు
Read Latest Telangana News and National News