BJP: రేషన్ బియ్యంలో కేంద్రం వాటానే ఎక్కువ..
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:22 AM
రేషన్ బియ్యంలో కేంద్రం వాటానే ఎక్కువ అని, అయినప్పటికీ ఆ విషయాన్ని బయటకు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కిపెడుతుందని భారతీయ జనతా పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో ఘోరంగా విఫలమైందన్నారు.

హైదరాబాద్: ‘భారత దేశంలో వన్ నేషన్ వన్ రేషన్ ప్రవేశ పెట్టిందే బీజేపీ(BJP) ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా తెలంగాణలో కూడా తెల్లరేషన్ కార్డు కల్గిన ప్రతి ఒక్కరికీ ఐదు కిలోల బియ్యం మూడు సంవత్సరాల నుంచి ఉచితంగా అందిస్తోంది నరేంద్ర మోదీ(Narendra Modi) సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం’ అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోలన్ శంకర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మైనారిటీ మోర్చానాయకుడు ముహ్మద్ నయీమ్ అన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: MLA: హెచ్‌సీయూ విద్యార్థులకు అండగా బీఆర్‌ఎస్
మామిడిపల్లి గ్రామంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సన్నబియ్యం పథకంలో కూడా బీజేపీ ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇస్తుందని, ఇప్పటి వరకు అందించిన ఉచిత బియ్యంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 76 లక్షల తెల్లరేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. వీటి ద్వారా 2.80 కోట్ల పేద ప్రజలకు లబ్ధిచేకూరుతుందన్నారు. కేంద్రప్రభుత్వం సుమారు 56 శాతం బరిస్తోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 44 శాతం మాత్రమే బరిస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో ఎక్కడ కూడా మోదీ పేరు కానీ, ఆయన ఫొటో కానీ పెట్టలేదన్నారు. ఇప్పుడు ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా 41శాతం ఉందని, ఈ పథకం ద్వార రాష్ట్ర ప్రభుత్వానికి భారం అధికంగా పడుతుందన్నారు. దీనికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు చేసే హడావిడి అంతాఇంతా కాదన్నారు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చినట్టే ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పెరమోని నరేష్‌యాదవ్, గురజాని గణేష్‌గౌడ్, గుజ్జుల పద్మారావు, యాతం మహేందర్‌యాదవ్, యాతం శ్రీకాంత్, చిల్కూరి శంకర్, కర్ణకోట జగదీష్, ఆదిల అర్జున్, ఆదిల నర్సింహ, ఆదిల బలరాజ్, పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కొత్త తల్లులు గిల్ట్ లేకుండా..
ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..
Read Latest Telangana News and National News