అంబేద్కర్‌ను అవమానించిన చరిత్ర కాంగ్రెస్‌దే
ABN , Publish Date - Apr 13 , 2025 | 10:51 PM
అంబేద్కర్‌ను అడుగడుగనా అవమానించిన చరిత్ర కాంగ్రెస్‌కే దక్కుతుందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హారీష్ బాబు అన్నారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో నస్పూర్ పట్టణంలోని సీసీసీ కార్నర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూల మాలలు వేసి నివాళులు ఆర్పిం చారు.

సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు
నస్పూర్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి) : అంబేద్కర్‌ను అడుగడుగనా అవమానించిన చరిత్ర కాంగ్రెస్‌కే దక్కుతుందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హారీష్ బాబు అన్నారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో నస్పూర్ పట్టణంలోని సీసీసీ కార్నర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూల మాలలు వేసి నివాళులు ఆర్పిం చారు. అనంతరం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా చేపట్టే సేవ కార్యక్రమాలపై దిశా నిర్థేశం చేశారు. ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్, మాజీ అద్యక్షుడు రఘునాథ్‌లతో కలిసి మాట్లాడారు. నెహ్రూ నుంచి నేటి రాహూల్ గాంధీ వరకు అంబేద్కర్ ఆశయాలకు, సిద్ధాంతాలకు వ్యతి రేకులన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీం, జై సంవిదాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నిర్వహించడం సిగ్గు చేటన్నారు. బీజేపీ ప్రభుత్వం దళితుడైన రామ్‌నాథ్ కోవింద్, ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ములను రాష్ట్రపతిని చేసిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ లను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. ప్రాణ హిత- తు మ్మిడిహెట్టి ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేయాలన్నారు. ఇదే విషయంపై తాము సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ నాయకు లు దుర్గం అశోక్, కొయ్యల ఏమాజీ, పెద్దపల్లి పురుషోత్తం, అమరాజుల శ్రీదేవి, కోడి రమేష్, గాజుల ముఖేష్ గౌడ్, బియ్యాల సతీష్ రావు, మున్నారాజా సిసోడియా, సత్రం రమేష్ పాల్గొన్నారు.