HCU: విద్యార్థులపై లాఠీచార్జ్ చేయలేదు
ABN , Publish Date - Apr 04 , 2025 | 03:50 AM
హెచ్‌సీయూ వద్ద విద్యార్థులపై లాఠీచార్జ్ చేయలేదని మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ స్పష్టం చేశారు. పోలీసుల విధులను అడ్డుకున్న కొందరు విద్యార్థులను చెదరగొట్టామని వివరించారు.

పోలీసులను అడ్డుకున్న వారిని చెదరగొట్టాం
హెచ్‌సీయూ సంఘటనపై డీసీపీ వివరణ
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): హెచ్‌సీయూ వద్ద విద్యార్థులపై లాఠీచార్జ్ చేయలేదని మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ స్పష్టం చేశారు. పోలీసుల విధులను అడ్డుకున్న కొందరు విద్యార్థులను చెదరగొట్టామని వివరించారు. ఆ చర్య విద్యార్థులను వెనక్కి పంపడమే తప్ప.. లాఠీచార్జ్ కాదని పేర్కొన్నారు. పలు పత్రికలు, ఎలకా్ట్రనిక్ మీడియాలో విద్యార్థులపై లాఠీచార్జ్ జరిగినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ‘‘కొందరు విద్యార్థులు అత్యుత్సాహంతో పోలీసులు అడ్డంగా పెట్టిన తాడును లాక్కొన్నారు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు వారిని చెదరగొట్టి, తాడును తిరిగి స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లోనూ ఈ విషయాన్ని గుర్తించవచ్చు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..
For More AP News and Telugu News