Share News

Hyderabad: రూపాయికే డ్రెస్‌ అంటూ పబ్లిసిటీ..

ABN , Publish Date - Apr 08 , 2025 | 08:52 AM

మనోళ్లకు ఏదైనా తక్కువకు వస్తుందంటే చాలు.. హడావుడి చేస్తుంటారు. ఇలాంటిదే మన హైదరాబాద్ నగరంలో జరిగింది. రూపాయికే డ్రెస్‌ అంటూ వస్త్ర దుకాణం వారు ప్రకటించడంతో.. ఇక పెద్దఎత్తున కొనుగోలుకు విచ్చేశారు. అలా వచ్చిన వారిని కంట్రోల్ చేయలేక చివరకు దుకాణాన్నే మూసివేయాల్సి వచ్చింది.

Hyderabad: రూపాయికే డ్రెస్‌ అంటూ పబ్లిసిటీ..

- భారీగా ఎగబడిన యువకులు

- కంట్రోల్‌ చేయలేక దుకాణం మూసివేత

హైదరాబాద్: దుస్తుల దుకాణం మొదటి వార్షికోత్సవం సందర్భంగా మార్కెటింగ్‌ స్టంట్‌(Marketing Stunt)లో భాగంగా రూపాయికే డ్రెస్‌ అంటూ ఆఫర్‌ పెట్టారు. సోషల్‌ మీడియా(Social Media)లోనూ ప్రచారం చేశారు. దీంతో సైదాబాద్‌ సింగరేణి ఆఫీసర్స్‌ కాలనీ(Saidhabad Singareni Officers Colony) ప్రధాన రహదారిపై ఉన్న ట్రెండింగ్‌ ఫ్యాషన్స్‌ షోరూంకు యువకులు సోమవారం ఉదయం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఈ వార్తను కూడా చదవండి: Minister: హైదరాబాద్ వాసులకు గోదావరి జలాలు..


city4.jpg

నిర్వాహకులు వారిని కంట్రోల్‌ చేయలేకపోయారు. కొందరు యువకులు దొరికిన వస్త్రాలను ఉచితంగా పట్టుకుని పోయారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో నిర్వాహకులు సైదాబాద్‌ పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు కూడా అదుపు చేయలేకపోయారు. దీంతో దుకాణాన్ని మూసివేయించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం

ఉదయం ఎండ .. సాయంత్రం వాన

నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ లైన్లు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 08 , 2025 | 08:57 AM