Damodhar: క్షేమంగానే దామోదర్?
ABN , Publish Date - Jan 21 , 2025 | 06:01 AM
ఛత్తీస్‌గఢ్ -తెలంగాణ సరిహద్దుల్లోని మారేడుబాక అడవుల్లో ఈ నెల 16న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఒడిసా సరిహద్దుల్లో.. ఇద్దరు నక్సల్స్ కాల్చివేత
చర్ల/ములుగు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్ -తెలంగాణ సరిహద్దుల్లోని మారేడుబాక అడవుల్లో ఈ నెల 16న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన మృతిచెందినట్లు దక్షిణ బస్తర్ కమిటీ కార్యదర్శి గంగా పేరుతో లేఖ విడుదలైనా.. పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం ధ్రువీకరించలేదు.
అయితే.. గంగా పేరిట లేఖ పంపిందెవరనేది ఇప్పటికీ మిస్టరీగా ఉంది. కాగా.. ఛత్తీస్‌గఢ్ -ఒడిసా సరిహద్దుల్లో సోమవారం ఉదయం పోలీసులు-నక్సల్స్‌కు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఛత్తీస్‌గఢ్ లోని గరియాబంద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఓ జవాన్ గాయపడ్డట్లు తెలిసింది.