Share News

Nalgonda: పరువు ఆత్మహత్య!

ABN , Publish Date - Apr 13 , 2025 | 05:23 AM

కుమా ర్తె కులాంతర ప్రేమ వివాహం చేసుకుందన్న మనస్తాపంతో ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లగొండ జిల్లా చిట్యాలలో జరిగింది.

Nalgonda: పరువు ఆత్మహత్య!

  • కుమార్తె కులాంతర ప్రేమ వివాహం.. మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య

  • నల్లగొండ జిల్లా చిట్యాలలో ఘటన

  • తండ్రిని కడసారి చూసేందుకూ రానన్న కుమార్తె

చిట్యాల, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): కుమా ర్తె కులాంతర ప్రేమ వివాహం చేసుకుందన్న మనస్తాపంతో ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లగొండ జిల్లా చిట్యాలలో జరిగింది. డిగ్రీ ఫస్టియర్‌ చదువుతున్న చిట్యాల వాసి రెముడాల గట్టయ్య (48) కుమార్తె.. అదే పట్టణవాసి ఓ దళిత యువకుడిని ప్రే మించి కుటుంబసభ్యులకు తెలియకుండా గతనెల 8న పెళ్లి చేసుకుంది. దీనిపై గట్టయ్య తన కుమార్తె అదృశ్యమైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి కుమార్తె ప్రేమవివాహం చేసుకుని జిల్లా ఎస్పీ దగ్గర సరెండర్‌ అయిందని, తల్లిదండ్రులను కలవనని చెప్పిందని స్థానిక ఎస్‌ఐ అతడికి చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన గట్టయ్య ఈ నెల 10న ఆత్మహత్యాయత్నం చేశాడు.


దీంతో ఆయన్న కుటుంబసభ్యులు చికిత్స కోసం నార్కట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి.. తర్వాత పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొం దుతూ శనివారం గట్టయ్య మృతి చెందాడు. గట్టయ్య మృతికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ అతడి బంధువులు చిట్యాల పోలీ్‌సస్టేషన్‌ వద్ద ధర్నా చేశారు. అయితే, గట్టయ్య ఫిర్యాదు ఇచ్చిన వెంటనే విచారణ చేపట్టేలోపే.. అతని కుమార్తె తన తల్లిదండ్రులు, బంధువులతో ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరడంతోపాటు తల్లిదండ్రులను కలవనని స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లు చిట్యాల ఎస్‌ఐ తెలిపారు. కాగా, గట్టయ్య ఆత్మహత్య వార్తను అతడి కుమార్తెకు ఫోన్‌లో చెప్పి చివరిచూపు కోసం రావాలని బంధువులు కోరుతున్నారన్నా రానని తెగేసి చెప్పినట్లు పోలీసులు తెలిపారు

Updated Date - Apr 13 , 2025 | 05:23 AM