Harish Rao: హరీశ్‌పై బాచుపల్లి పీఎస్‌లో కేసు నమోదు
ABN , Publish Date - Mar 01 , 2025 | 04:35 AM
మాజీ మంత్రి హరీశ్‌రావుపై హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ఉపేందర్ తెలిపారు.

ఫిర్యాదు చేసిన చక్రధర్ గౌడ్.. మరో ముగ్గురిపైనా కేసు
హైదరాబాద్/నిజాంపేట్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి హరీశ్‌రావుపై హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ఉపేందర్ తెలిపారు. గతంలో ఫోన్ ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేసిన తనకు హరీశ్‌తోపాటు మరో ముగ్గురి నుంచి ప్రాణహాని ఉందని, చంపేస్తామని బెదిరిస్తున్నారని చక్రధర్‌గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఏ-1గా వంశీకృష్ణ, ఏ-2గా హరీశ్‌రావు, ఏ-3గా సంతో్‌షకుమార్, ఏ-4గా పరశురామ్‌లపై కేసు నమోదు చేశారు.
హరీశ్‌పై ఎన్ని కేసులు పెడతావ్ రేవంత్: ఎర్రోళ్ల శ్రీనివాస్
‘ప్రజల తరఫున నిన్నూ, నీ ప్రభుత్వాన్ని అనుక్షణం నిలదీస్తున్న హరీశ్‌రావుపై అక్రమ కేసులు పెడతావా? ప్రశ్నించే స్వేచ్ఛపై, ప్రజాస్వామ్యంపై దాడిచేస్తావా? ఎన్ని పోలీ్‌సస్టేషన్లలో కేసులు పెడతావ్ రేవంత్‌రెడ్డీ..’ అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రశ్నించారు. ఎల్‌ఎల్‌బీసీ వద్ద మాట్లాడినందుకు బాచుపల్లి పోలీసు ేస్టషన్‌లో హరీశ్‌రావుపై కేసు పెట్టడం ఏంటని ఆయన నిలదీశారు.