Alleti Maheshwar Reddy: రేవంత్ ప్రభుత్వంపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Jan 05 , 2025 | 06:32 PM
Alleti Maheshwar Reddy: ఆరు గ్యారంటీలనుపూర్తిగా అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు స్పష్టత లేదని మండిపడ్డారు.
హైదరాబాద్: రేవంత్ ప్రభుత్వం ప్రజాఆకాంక్షలకు వ్యతిరేకంగా పని చేస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. శనివారం కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు నిరాశపరిచాయని అన్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు కేబినెట్ నిర్ణయాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు స్పష్టత లేదని మండిపడ్డారు. పెన్షన్ పెంపు, ఆరు గ్యారంటీలను పట్టించుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ఇవాళ (ఆదివారం) హైదరాబాద్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ అవినీతి చర్యలపై దాటవేత ధోరణిని రేవంత్ ప్రభుత్వం అవలంభిస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ది డూప్ ఫైట్ అని సెటైర్లు గుప్పించారు. తాను లేవనెత్తిన పలు అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించకపోవడం ప్రభుత్వం తప్పు చేసిందనే దానికి నిదర్శనమని ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.
హెటిరో స్కాంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. సివిల్ సప్లై అక్రమాలపై ఆధారాలు బయట పెట్టినా రేవంత్ ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ తప్పు ఒప్పుకుంటున్నారా అని నిలదీశారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ వ్యవహారంలో ఇప్పటికైనా కళ్లు తెరవాలని అన్నారు. సీఎం రేవంత్ నియోజకవర్గం కొడంగల్ లిఫ్ట్ టెండర్లు గోల్‌మాల్ సంగతేంటని ప్రశ్నించారు. ఈ అన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం.. పోరాడుతాం ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఏలేటి మహేశ్వర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
ఆ ఫ్లైఓవర్‌కు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పేరు పెట్టాలి: రాజాసింగ్
ఆరంఘర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూ పార్క్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు కొత్తగా కట్టిన ఫ్లై ఓవర్ ప్రారంభం కార్యక్రమం రేపు ఉందని చెప్పారు. మొత్తం ఫ్లై ఓవర్ పైన ఎంఐఎం జెండాలు, బ్యానర్లు పెట్టారని మండిపడ్డారు. ఈ ఫ్లైఓవర్ రూ.800 కోట్లతో కట్టారని అన్నారు. ఈ ఫ్లై ఓవర్‌కు ఎంఐఎం సపరేట్ ఫండ్ ఏమైనా ఇచ్చిందా? అని నిలదీశారు. అన్ని బ్యానర్లు, పోస్టర్లు తొలగించాలని తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తున్నానని అన్నారు. ఓవైసీ పేరుపైన ఈ ఫ్లైఓవర్ పెడతారంట అని ఆరోపించారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పేరును ఈ ఫ్లై ఓవర్‌కు పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డిని రాజాసింగ్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
KTR: సీఎం రేవంత్ పచ్చి అబ్బద్దాలు మాట్లాడుతున్నారు.. కేటీఆర్ ధ్వజం
Dr. Lakshman: కోతలపాలన.. ఎగవేతల ప్రభుత్వం..: ఎంపీ డాక్టర్ లక్ష్మణ్
KTR: మోసానికి మారు పేరు కాంగ్రెస్: కేటీఆర్
HYDRA: అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా..
Read Latest Telangana News and Telugu News