Share News

Manchu Family: మంచు ఫ్యామిలీలో మరోసారి రచ్చ.. పోలీస్ స్టేషన్‌లో మనోజ్

ABN , Publish Date - Apr 08 , 2025 | 06:34 PM

Manchu Family: మరోసారి మంచు ఫ్యామిలీలో విభేదాలు రచ్చకెక్కాయి. దీంతో మంచు మనోజ్.. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. సోదరు మంచు విష్ణుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై తన తండ్రి మోహన్ బాబుతో చర్చించాలని భావించాడు. కానీ మోహన్ బాబు అందుబాటులో లేక పోవడంతో మంచు మనోజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Manchu Family: మంచు ఫ్యామిలీలో మరోసారి రచ్చ.. పోలీస్ స్టేషన్‌లో మనోజ్

హైదరాబాద్, ఏప్రిల్ 08: మరోసారి మంచు ఫ్యామిలీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో మంచు ఫ్యామిలీలోని సభ్యులు మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. మంగళవారం నార్సింగి పోలీస్ స్టేషన్‌‌లో సోదరుడు మంచు విష్ణుపై మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. తన కుమార్తె బర్త్ డే నేపథ్యంలో తన కుటుంబం రాజస్థాన్ వెళ్లిందని.. ఆ సమయంలో తన ఇల్లు ధ్వంసం చేశారని తన ఫిర్యాదులో మంచు మనోజ్ పేర్కొన్నారు. తాను ఇంట్లో లేని సమయంలో తన కారుతోపాటు వస్తువులను సైతం దొంగిలించాడని తెలిపారు.

జల్‌పల్లిలోని ఇంటిలో సైతం 150 మంది చొరబడి విధ్వంసం సృష్టించారరని ఆ ఫిర్యాదులో స్పష్టం చేశారు. తన ఇంటిలోని విలువైన వస్తువులతోపాటు కార్లను కూడా ఎత్తుకొని వెళ్లారని మంచు మనోజ్ స్పష్టం చేశారు. అయితే తన ఇంటి నుంచి చోరీ అయిన కార్లు విష్ణు కార్యాలయంలో లభ్యమైనాయని పేర్కొన్నారు. తన ఇంట్లోకి గోడలు దూకి వచ్చి కార్లను ఎత్తుకొని వెళ్లారని చెప్పారు.


అంతేకాదు.. ముఖ్యమైన వస్తువులన్నింటిని పగల కొట్టి విధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంట్లో జరుగుతోన్న పరిణామాలపై తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించానన్నారు. కానీ తన తండ్రి అందుబాటులోకి రాలేదన్నారు. ఈ కేసులో తనకు న్యాయం చేయమని పోలీసులను కలిసి విజ్ఞప్తి చేశానని మంచు మనోజ్ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Manchu Family: మంచు ఫ్యామిలీలో మరోసారి రచ్చ.. పోలీస్ స్టేషన్‌లో మనోజ్

Somu Veerraju: సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు


Dilshuknagar Bomb Blast: దోషుల తరఫున వాదించింది ఎవరంటే..

Chandrababu: చంద్రబాబుకు సొంత ఇల్లు..

Jaipur Bomb Blast Case: జైపూర్ బాంబు పేలుళ్ల కేసు: దోషులకు జీవిత ఖైదు



Updated Date - Apr 08 , 2025 | 06:43 PM