CM Revanth Reddy: వారిని ఇబ్బంది పెట్టొద్దు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ABN, Publish Date - Mar 31 , 2025 | 05:54 PM
CM Revanth Reddy: సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య వైరం నెలకొన్న విషయం తెలిసిందే. ఫ్రీ పాసుల కోసం తమను HCA వేధిస్తోందని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం ఆరోపించింది. హైదరాబాద్‌ను వీడి వెళ్లిపోతామని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం తెలిపింది. ఈ విషయంలో HCAపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మధ్య వివాదం జరుగుతోంది. అయితే ఈ విషయంలో (HCA)పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సీరియస్ అయ్యారు. ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని వేధింపులకు గురిచేసి పాసులు అడిగిన విషయంపై వివరాలు సేకరించారు. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం మఖ్యమంత్రితో చర్చించింది. అనంతరం మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని పాసుల విషయంలో బెదిరించిన అంశంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.
వివాదం జరగడానికి కారణమిదేనా..
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మధ్య వైరం నెలకొన్న విషయం తెలిసిందే. ఫ్రీ పాసుల కోసం తమను HCA వేధిస్తోందని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం ఆరోపించింది. దీంతో హైదరాబాద్‌ను వీడి వెళ్లిపోతామని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం తెలిపింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు ఎస్‌ఆర్‌హెచ్ ప్రతినిధి లేఖ రాశారు. హెచ్‌సీయూ అధ్యక్షుడు జగన్మోహనరావు ఫ్రీ టికెట్స్ కోసం తమను వేధిస్తున్నారంటూ లేఖలో ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం పేర్కొంది. ఇప్పటికే పదిశాతం టికెట్లు ఇస్తున్నామని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం స్పష్టం చేసింది. టికెట్ల కోసం బెదిరిస్తూ మ్యాచ్‌కు ముందు.. కార్పొరేట్ బాక్స్‌లకు తాళం వేశారని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం ఆరోపించింది. ఐపీఎల్ కోసం స్టేడియం అద్దె మొత్తం చెల్లిస్తున్నా.. HCA పెత్తనం చేయాలని చూస్తోందని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అపెక్స్ కౌన్సిల్‌తో చర్చలకు ఏర్పాటు చేయాలని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం కోరింది. చర్చలు సఫలం కాకపోతే బీసీసీఐతో చర్చించి వేదికను మార్చుకుంటామని సన్‌రైజర్స్ హైదరాబాద్ తేల్చిచెప్పింది.
ఈ వార్తలు కూాడా చదవండి
Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది
HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Mar 31 , 2025 | 06:19 PM