Share News

ENO: కేసీఆర్, కేటీఆర్‌లకు కొరియర్‌లో ENO ప్యాకెట్లు

ABN , Publish Date - Jan 24 , 2025 | 06:40 PM

ENO: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై బీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు. అలాంటి వేళ.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ స్పందించారు. ఈ క్రమంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.

ENO: కేసీఆర్, కేటీఆర్‌లకు కొరియర్‌లో ENO ప్యాకెట్లు

హైదరాబాద్, జనవరి 24: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అగ్ర నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అలాంటి వేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ స్పందించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమాశంలో ఆయన మాట్లాడుతూ.. గేమ్ చేంజర్‌లాగా రైజింగ్ తెలంగాణ కోసం రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి బృందం పెట్టుబడులు తీసుకు వచ్చారని తెలిపారు.

తాము అభివృద్ధి చేస్తుంటే బీఆర్ఎస్ వాళ్లు తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్య నిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఈనో (ENO) ప్యాకెట్లు కొరియర్ చేసినట్లు చెప్పారు. బీఆర్ఎస్ నేతల కడుపు మంట తగ్గడం కోసం.. వారికి ENO ప్యాకెట్లు పంపిస్తున్నామని వివరించారు. బీఆర్ఎస్ వాళ్ళకి జీర్ణించుకునే తత్వం పెరగడం కోసం ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు.

అలాగే కేసీఆర్, కేటీఆర్ కడుపు మంట తగ్గడం కోసం ENO ప్యాకెట్లను కొరియర్ చేస్తున్నానన్నారు. బీఆర్ఎస్ నేతలకు ఈనో ప్యాకెట్లు పంపాలంటూ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ పిలుపు నిచ్చారు. రాష్ట్రంలోని అభివృద్ధి తట్టుకోలేక పోతున్న వారు.. ఈ ENOతో జీర్ణించుకొంటారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే గుడ్డలు ఊడదీసి కొడతామంటూ బీఆర్ఎస్ నేతలను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ హెచ్చరించారు.


యూరప్‌లోని దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. రూ. లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తీసుకు వచ్చారు. ఈ పర్యటన ముగించుకొని ఆయన హైదరాబాద్ సైతం చేరుకొన్నారు. అయితే రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై బీఆర్ఎస్ అగ్రనేతలు వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు.

Also Read : తురకా కిషోర్‌ను నెల్లూరు జైలుకు తరలింపు

Also Read: రైలు ప్రమాద బాధితులు.. నష్ట పరిహారం ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే..?


తెలంగాణకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మెగా కృష్ణారెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని ఎదురు బదురు ఇళ్లలోనే నివసిస్తారని గుర్తు చేశారు. అలాంటిది వీరిద్దరు.. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం దావోస్ వెళ్లాలా అంటూ బీఆర్ఎస్ అగ్రనేతల్లో ఒకరైన హరీష్ రావు వ్యంగ్యంగా ప్రశ్నించారు.

Also Read: దావోస్ దారి ఖర్చులు వృధా చేసిన సీఎం రేవంత్

Also Read: మరికొన్ని గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు.. రైతు భరోసా పథకానికి కావాల్సింది ఇవే..


అంతేకాదు.. రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు నగదు వృధా అంటూ చరకలు వేశారు. అలాగే రేవంత్ రెడ్డి ఈ పర్యటనపై బీఆర్ఎస్ నేతల తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అలాంటి వేళ.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ బీఆర్ఎస్ నేతల్లో కడుపు మంట పెరిగిపోయిందని.. దీనిని తగ్గించడానికి ఈనో ప్యాకెట్లు పంపాలని నిర్ణయించారు.

For Telangana News And Telugu News

Updated Date - Jan 24 , 2025 | 06:40 PM