ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Fire Accident: హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. భయంతో జనం పరుగులు

ABN, Publish Date - Mar 31 , 2025 | 05:06 PM

Hyderabad Fire Incident: హైద‌రాబాద్ న‌గ‌రాన్ని అగ్నిప్ర‌మాదాలు వరుసగా వెంటాడుతూనే ఉన్నాయి. వరుస అగ్నిప్రమాదాలు జరుగుతుండటంతో నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇవాళ నాచారంలో మరో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక అధికారులు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

Hyderabad Fire Incident

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఇటీవల పలు ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక వాడ ఉన్న ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. సరైన రక్షణ చర్యలు పాటించకపోవడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇవాళ (సోమవారం) నాచారం పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.


బీవైసీ ఫ్యాబ్రికేషన్స్ పరిశ్రమలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేస్తున్నారు. పొగలు దట్టంగా వ్యాపించడంతో అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. చట్టూ పక్కల ప్రాంతాల్లో పొగ వ్యాపించి స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూాడా చదవండి

Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది

HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 31 , 2025 | 05:08 PM