Share News

Weather Updates: భాగ్యనగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం

ABN , Publish Date - Apr 03 , 2025 | 03:23 PM

Weather Updates: హైదరాబాద్‌లో భారీగా వర్షం కురుస్తోంది. వర్షం రాకతో భాగ్యనగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

Weather Updates: భాగ్యనగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం
Weather Updates

హైదరాబాద్, ఏప్రిల్ 3: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొద్దిరోజులుగా భానుడి ప్రతాపంతో అల్లాడిపోయిన నగర వాసులకు (Hyderabad) వర్షం రాకతో కొంత ఉపశమనం లభించింది. మధ్యాహ్నం వరకు ఎండ, ఉక్కపోత ఇబ్బందులు పడగా.. ఆ తరువాత భాగ్యనగరం ఒక్కసారిగా చల్లబడిపోయింది. గ్రేటర్ హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో పాటు బషీర్ బాగ్, సైఫాబాద్, అబిడ్స్, కోఠి, కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. బోరబండ, మధురానగర్‌, అమీర్‌పేట, సనత్‌నగర్‌లో వర్షం కురుస్తోంది. ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, కృష్ణానగర్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది. హిమాయత్‌నగర్‌, నారాయణగూడ, సుల్తాన్‌బజార్‌, ముషీరాబాద్‌, రాంనగర్‌, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, బాగ్‌లింగంపల్లి, గాంధీనగర్‌, కవాడిగూడ, భోలక్‌పూర్‌, మేడ్చల్‌, కండ్లకోయ, దుండిగల్‌, గండిమైసమ్మ, నాచారం, మల్లాపూర్‌, బహదూర్‌పల్లి, గాగిల్లాపూర్‌లో అరగంట నుంచి వర్షం కురుస్తోంది. దీంతో ఉదయం నుంచి ఎండతో ఉక్కిరిబిక్కిర అయిన హైదరాబాదీలు ఒక్కసారిగా వర్షం పడటంతో ఎంజాయ్ చేస్తున్నారు.


అటు తెలంగాణ వ్యాప్తంగా కూడా వాన దంచి కొడుతోంది. సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు, రామచంద్రాపురం, బీహెచ్‌ఈఎల్, పాశంమైలారం, పారిశ్రామికవాడ ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అకస్మాత్తుగా వర్షంతో ఉక్కబోతతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనాన్ని కలిగించింది. అటు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. బాన్సువాడ, బీర్కూర్, వర్ని, ఇందల్ వాయి, దర్పల్లి, సిరికొండ మండలాల్లో ఓ మోస్తరు వానలు పడుతున్నాయి. వర్షాలతో వరి పంట నేలరాలింది. ధాన్యం గింజలు రాలిపోయాయింది. దీంతో కోత దశలో అకాల వర్షాలు రావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో


మరో రెండు రోజులు

మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భూ ఉపరితలం వేడెక్కడంతో పాటు ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వర్షం ధాటికి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ సిగ్నల్ల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వర్షం కారణంగా వాహనాలు నెమ్మదిగా వెళ్తుండటంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఈరోజుతో పాటు మరో రెండు రోజులు వర్షం పడే అవకాశం ఉండటంతో ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనే చెప్పుకోవచ్చు.


ఇవి కూడా చదవండి

Amaravati Capital Construction: అమరావతికి నిధులొచ్చాయ్‌

NTPC Fined: పెద్దపల్లిలో ఎన్టీపీసీకి బిగ్ షాకిచ్చిన మున్సిపల్ శాఖ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 03 , 2025 | 03:56 PM