Share News

HCU Land Issue: పోలీసుల విచారణలో బీఆర్ఎస్ కీలక నేతలు.. ఎందుకంటే..

ABN , Publish Date - Apr 09 , 2025 | 07:59 PM

HCU Land Issue: తెలంగాణలో హెచ్‌సీయూ భూముల వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్‌లో బీఆర్ఎస్ నేతలు ఫేక్ వీడియోలతో ప్రచారం చేశారని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు బీఆర్ఎస్ నేతలను విచారణ చేస్తున్నారు.

HCU Land Issue: పోలీసుల విచారణలో బీఆర్ఎస్ కీలక నేతలు.. ఎందుకంటే..
HCU Land Issue

హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల వివాదం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ఏఐ ఆధారిత నకిలీ వీడియోలు, ఫొటోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు పోలీసులు రంగంలోకి ఏఐ వీడియోలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలను పోలీసులు విచారణ చేస్తున్నారు.


హెచ్‌సీయూ భూములు ఫేక్ ఏఐ వీడియోల వ్యవహారంలో బుధవారం నాడు కూడా పోలీసుల విచారణ కొనసాగుతోంది. బీఆర్ఎస్ నేత మన్నెం క్రిశాంక్, కొణతం దిలీప్‌ను సుదీర్ఘంగా గచ్చిబౌలి పోలీసులు విచారిస్తున్నారు. క్రిశాంక్ , కొణతం దిలీప్ నివాసంలో సోదాలకు పోలీసులు సిద్ధం అవుతున్నారు. దర్యాప్తులో భాగంగా మొబైల్ ఫోన్లు తీసుకురావాలని పోలీసులు కోరారు. మొబైల్ ఫోన్లు తీసుకు రాకపోవడంతో మన్నెం క్రిశాంక్, కొణతం దిలీప్ ఇంట్లో సోదాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. విచారణ ముగిసిన పోలీసులు నోటీసులు ఇవ్వడం లేదని దిలీప్, క్రిశాంక్ న్యాయవాదులు ఆరోపణలు చేస్తున్నారు. మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని పరిశీలించే పనిలో పోలీసులు ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్ కేసు.. ప్రధాన నిందితుడి పాస్‌పోర్ట్ రద్దు

Manchu Manoj: నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలన్నది అతని లక్ష్యం..

Mohan Babu Family Dispute: మోహన్‌బాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 09 , 2025 | 08:09 PM