Share News

Telangana Govt: కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో మరో కీలక పరిణామం

ABN , Publish Date - Apr 15 , 2025 | 10:26 AM

Kanche Gachibowli Land Issue: తెలంగాణ వ్యాప్తంగా కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం సంచలనంగా మారింది. ఈ భూముల విషయంలో కొంతమంది కావాలనే ఫేక్ వీడియోలు, ఫొటోలు ప్రచారం చేశారని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. దీంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Telangana Govt: కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో మరో కీలక పరిణామం
Kanche Gachibowli Land Issue

హైదరాబాద్: తెలంగాణలో కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా కొంతమంది ప్రచారం చేశారని తెలంగాణ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో రాష్ట్ర పోలీసులను సర్కార్ రంగంలోకి దింపింది. నకిలీ వీడియోలు, ఫొటోలు ఎవరైతే ప్రచారం చేశారో వారిని గుర్తించాలని ఆదేశించింది. దీంతో పోలీసులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. కాగా.. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఫేక్ పోస్ట్‌లపై తెలంగాణ పోలీస్ శాఖ అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేయనున్నారు.


ఫేక్ వీడియోలు, ఏఐ ఫేక్ ఫొటోలు పెట్టిన పలువురిని గుర్తించారు. ఫేక్ పోస్ట్‌లపై పోలీసులు నిఘా పెట్టడంతో పోస్ట్‌లను పలువురు సెలబ్రిటీలు డిలీట్ చేశారు. ఫేక్ పోస్ట్‌లు పెట్టీ వైరల్ చేసి డిలీట్ చేసిన వారి వివరాలను పోలీసులు సేకరించారు. మార్చ్ 31వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు మధ్యలో ఫేక్ పోస్ట్‌లు పెట్టినట్లుగా గుర్తించారు. వారి సోషల్ మీడియా ఖాతా URLతో సహా వివరాలను పోలీసులు సేకరించారు. పోస్టులు తొలగించని వ్యక్తులకు పోలీసులు నోటీసులు పంపుతున్నారు. 25 మంది సెలబ్రెటీలు పోస్ట్‌లు తొలగించినట్లు పోలీస్ శాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఇదే వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు గుర్తించారు. బీఆర్ఎస్ నేతలు మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్ కుమార్‌లకు పోలీసులు ఏప్రిల్ 9,10వ తేదీల్లో నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. వారు విచారణకు హాజరై పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వారు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో మళ్లీ విచారణ చేస్తామని పోలీసులు అన్నారు. మరింత లోతుగా ఈ కేసును దర్యాప్తు చేయాలని పోలీసులు నిర్ణయించుకోవడంతో నకిలీ వీడియోలు, ఫొటోలు పెట్టిన వారు భయపడిపోతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Narendra Modi: తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు

KTR: ఒక్కసారి ఓటేస్తే.. ఐదేళ్ల శిక్షగా మారింది!

Kishan Reddy: అంబేడ్కర్‌ను అవమానించిన నీచ చరిత్ర కాంగ్రెస్‌ది

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 15 , 2025 | 10:45 AM