KTR : మందా జగన్నాథం పాలమూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు
ABN, Publish Date - Jan 13 , 2025 | 01:46 PM
KTR: మంద జగన్నాథం మరణంతో తెలంగాణ ఒక సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయిందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.పాలమూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని అన్నారు. నాలుగు సార్లు ఎంపీగా అయన అందించిన సేవలు చిరస్మరణీయమని చెప్పారు.
హైదరాబాద్: పాలమూరు జిల్లా రాజకీయాల్లో మాజీ ఎంపీ మందా జగన్నాథం తనదైన ముద్ర వేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. అనారోగ్యంతో మృతిచెందిన మంద జగన్నాథం పార్థివ దేహాన్ని కేటీఆర్, ఇతర నాయకులు. సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. జగన్నాథం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... మంద జగన్నాథం మరణంతో తెలంగాణ ఒక సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయిందని తెలిపారు. పాలమూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని అన్నారు. నాలుగు సార్లు ఎంపీగా అయన అందించిన సేవలు చిరస్మరణీయమని చెప్పారు. వివాదరహితుడు సౌమ్యుడు..తెలంగాణ మేలు కోరుకున్న వ్యక్తి అని చెప్పారు.మహబూబ్‌నగర్ అభివృద్ధిని మందా జగన్నాథం ఆకాంక్షించారని కేటీఆర్ తెలిపారు.
Updated Date - Jan 13 , 2025 | 01:46 PM