Minister Konda Surekha: ఏఐసీసీ అగ్రనేతలకు మంత్రి కొండా సురేఖ లేఖ .. ఎందుకంటే..
ABN, Publish Date - Feb 06 , 2025 | 02:39 PM
Minister Konda Surekha: ఏఐసీసీ అగ్రనేతలకు మంత్రి కొండా సేరేఖ ఇవాళ ఓ లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్‌లో పేర్కొన్న మేరకు ఈ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని పునరుద్ఘాటించారు.

హైదరాబాద్: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలకు సోనియా, రాహుల్ గాంధీలకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ మంత్రి కొండా సురేఖ గురువారం లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో బీసీ కులగణనను కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిందని స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా శ్రమించారని వెల్లడించారు.
ఈ సర్వే ద్వారా రాష్ట్రంలోని బీసీలకు మరింత న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్‌లో పేర్కొన్న మేరకు ఈ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని పునరుద్ఘాటించారు. ఈ మొత్తం బీసీ సర్వే ప్రక్రియలో పార్టీ, ప్రభుత్వపరంగా కాంగ్రెస్ అధినాయకత్వం చాలా సహకరించిందని అన్నారు.. అందుకు కృషి చేసిన ఏఐసీసీ అగ్రనేతలకు మంత్రి కొండా సురేఖ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు జాతీయ నాయకత్వానికి వేర్వురుగా లేఖలు రాశారు.
Updated Date - Feb 06 , 2025 | 03:46 PM